ETV Bharat / sports

'స్వర్ణ' సిమ్రాన్​- భారత్​ ఖాతాలో మరో ఐదు​ మెడల్స్​

దుబాయ్​ వేదికగా జరుగుతున్న పారా అథ్లెటిక్స్​ పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. రెండో రోజు రెండు గోల్డ్​ మెడల్స్​తో సహా మొత్తం ఐదు పతకాలు సాధించారు.

Simran Yadav wins gold, as India's good run continue in Dubai World Para Athletics GP
భారత్​ ఖాతాలో మరో రెండు గోల్డ్​ మెడల్స్​
author img

By

Published : Feb 13, 2021, 9:07 AM IST

Updated : Feb 13, 2021, 9:15 AM IST

దుబాయ్​ వేదికగా జరుగుతున్న 12వ ఫజ్జా ఇంటర్నేషనల్​ పారా అథ్లెటిక్స్​ గ్రాండ్​ ప్రిక్స్​ పోటీల్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. రెండో రోజూ ఐదు మెడల్స్​ సాధించారు. వాటిలో రెండు గోల్డ్​ మెడల్స్​ ఉన్నాయి.

మహిళల 100 మీటర్ల పరుగు పందెంలో సిమ్రాన్​ యాదవ్​ బంగారు పతకం సాధించింది. 12.74 సెకండ్లలోనే పరుగు పూర్తి చేసిన సిమ్రాన్​కు ఇది అంతర్జాతీయంగా రెండో గోల్డ్​ మెడల్​. 2019లో ఆమె చైనా గ్రాండ్​ ప్రిక్స్​ గెలుపొందింది.

రెండేళ్ల తర్వాత అంతర్జాతీయంగా గోల్డ్​ మెడల్​ సాధించడం సంతోషంగా ఉందని సిమ్రాన్​ యాదవ్​ తెలిపింది. టోక్యో 2020 పారాలింపిక్స్​లో.. తాజా రికార్డును బ్రేక్​ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె పేర్కొంది.

పురుషుల డిస్కస్​ త్రో ఎఫ్​55 పోటీల్లో నీరజ్​ యాదవ్​ 35.49 మీటర్లు విసిరి.. గోల్డ్​ మెడల్​ గెలుపొందాడు.

పురుషుల లాంగ్​ జంప్​ విభాగంలో ప్రవీణ్​ కుమార్(5.95 మీ), ప్రదీప్​(5.73మీ)లు రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. మహిళల జావెలిన్​ త్రో ఎఫ్34 పోటీ​ల్లో భాగ్యశ్రీ మహవీర్​ జాదవ్​ కాంస్య పతకం గెలుచుకుంది.

ఇదీ చదవండి: 'జట్టు గురించే ఆలోచిస్తా.. విమర్శలు పట్టించుకోను'

Last Updated : Feb 13, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.