భారత్‌కు బాగా పట్టున్న క్రీడల్లో షూటింగ్ ఒకటి. కానీ, 2026 కామన్వెల్త్ క్రీడల్లో షూటింగ్ చోటు కోల్పోయే ప్రమాదముంది. క్రీడల ఆతిథ్య రేసులో ముందున్న హమిల్టన్ సిటీ బిడ్ కమిటీ ప్రదిపాదించిన రోస్టర్‌లో షూటింగ్ లేదు. ఇప్పటికే బర్మింగ్‌హామ్(2022) క్రీడల జాబితా నుంచి షూటింగ్‌ను తొలగించడంపై విదాదం చెలరేగుతోంది.
1970లో తప్ప ఇప్పటివరకు అన్ని క్రీడల్లోనూ షూటింగ్ ఉంది. వాస్తవానికి 2022 క్రీడల నుంచి కూడా షూటింగ్‌ను తప్పించారు. కానీ, ఆ ఈవెంట్‌ను తాము చండీగఢ్‌లో నిర్వహిస్తామని చెబుతూ.. భారత్ కామన్వెల్త్ క్రీడల సమాఖ్య(సీజీఎఫ్)ను ఒప్పించింది. ఆర్చరీ కూడా చండీగఢ్‌లోనే జరగనుంది.