ETV Bharat / sports

అవకాశాలు కోల్పోవడంపై 'భారత అథ్లెట్​​ ఆవేదన'

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చాను.. డోపింగ్​ ఆరోపణల నుంచి ఎట్టకేలకు బయటపడింది. సంజిత శాంపిల్స్​లో డోపింగ్​కు సంబంధించిన ఎలాంటి​ ఆధారాలు కనుగొనలేదని ఐడబ్ల్యూఎఫ్​ స్పష్టం చేసింది. అయితే, తాను కొల్పోయిన జీవితానికి ఎవరు సమాధానం చెప్తారని సంజిత ప్రశ్నించింది. ఐడబ్ల్యూఎఫ్​ తనకు పరిహారం చెల్లించాలని డిమాండ్​ చేసింది.

Sanjita Chanu
సంజిత చాను
author img

By

Published : Jun 10, 2020, 5:49 PM IST

భారత మహిళా వెయిట్​ లిఫ్టర్​ సంజిత చానుపై ఉన్న డోపింగ్ ఆరోపణలను​ అంతర్జాతీయ వెయిట్​ లిఫ్టింగ్​ ఫెడరేషన్(ఐడబ్ల్యూఎఫ్​) ఉపసంహరించుకుంది.​ సంజిత శాంపిల్స్​లో డోపింగ్​కు సంబంధించి ఎలాంటి ఆధారాలు బయటపడలేదని స్పష్టం చేసింది. ప్రపంచ డోపింగ్ వ్యతిరేక సంస్థ (వాడా) సిఫార్సు మేరకు ఐడబ్ల్యూఎఫ్​ ఈ నిర్ణయం తీసుకుంది. 2019లో చాను డోపింగ్​ నమూనాలను పరీక్షించిన సాల్ట్​ లేక్​ సిటీలోని ప్రయోగశాల గుర్తింపునూ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు వాడా తెలిపింది.

అయితే, ఐడబ్ల్యూఎఫ్​ తనకు క్షమాపణ చెప్పాలని, ఇప్పటివరకు అనుభవించిన బాధకు పరిహారం చెల్లించాలని కామన్​వెల్త్​ గేమ్స్​ బంగారు పతక విజేత సంజిత డిమాండ్​ చేసింది.

Sanjita Chanu
సంజిత చాను

ఇప్పటికైనా డోపింగ్​ ఆరోపణల నుంచి బయట పడినందుకు సంతోషంగా ఉంది. కానీ, నేను కోల్పోయిన అవకాశాల సంగతేంటి? ఇప్పటివరకు నేను అనుభవించిన మానసిక క్షోభకు, మీరు చేసిన తప్పులన్నింటికీ బాధ్యులెవరు? సంవత్సరాల పాటు ఎటువంటి తీర్పు ఇవ్వకుండా ఒక అథ్లెట్​ను సస్పెన్షన్​లో ఉంచారు.

సంజిత చాను, భారత వెయిట్ ​లిఫ్టర్​

ఐడబ్ల్యూఎఫ్​ నిర్లక్ష్య వైఖరి కారణంగా.. తానూ టోక్యో ఒలింపిక్స్​కు అర్హత సాధించే అవకాశం కోల్పోయినట్లు ఆవేదన వ్యక్తం చేసింది సంజిత.

Sanjita Chanu
సంజిత చాను

ఇదేమైనా జోక్​ అనుకుంటున్నారా? ఐడబ్ల్యూఎఫ్​ ఒక అథ్లెట్​ కెరీర్​ గురించి పట్టించుకోదా? నాకు ఒలింపిక్స్ అవకాశాలను దూరం చేసే ఉద్దేశంతోనే ఇలా చేసిందా? ఒలింపిక్స్​లో పథకం సాధించాలని, కనీసం అందులో పాల్గొనాలన్నది ప్రతీ క్రీడాకారుడి కల. ఆ అవకాశాన్ని ఐడబ్ల్యూఎఫ్​ నాకు దూరం చేసింది.

సంజిత చాను, భారత వెయిట్ ​లిఫ్టర్​

క్వీన్స్​లాండ్​లోని గోల్డ్​కోస్ట్​లో జరిగిన 2018 కామన్​వెల్త్​ క్రీడల్లో.. మహిళల 53 కిలోల విభాగంలో స్వర్ణ పథకం సాధించింది చాను. అదే ఏడాది డోపింగ్​ ఆరోపణలతో మే 15న ఆమెపై తాత్కాలిక సస్పెషన్ వేటు పడింది.​ అనంతరం 2019 జనవరి 22న సంజితపై ఉన్న తాత్కాలిక సస్పెన్ష్​ను రద్దు చేసింది ఐడబ్ల్యూఎఫ్​. సంజిత డోపింగ్​ పరీక్షల్లో పొరపాటు చేసినట్లు నివేదికలో పేర్కొంది ఐడబ్ల్యూఎఫ్​.

ఇదీ చూడండి:పక్షి ప్రాణాలు కాపాడటంలో ధోనీకి సాయపడ్డ జీవా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.