ETV Bharat / sports

Australian open: రెండో రౌండ్​కు సానియా.. ముర్రే, ఎమ్మా ఔట్ - ఆస్ట్రేలియన్​ ఓపెన్​ సానియా మీర్జా

Australian open Sania mirza: ఆస్ట్రేలియా ఓపెన్​లో భాగంగా నేడు(గురువారం) జరిగిన పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్​ రామ్(అమెరికా)​ జోడీ విజయాన్ని అందుకున్నారు. కాగా, బ్రిటన్​ టెన్నిస్​ ఆటగాడు ఆండీ ముర్రే ఓటమిని చూశాడు.

australian open sania mirza
సానీయా మీర్జా ఆస్ట్రేలియన్​ ఓపెన్​
author img

By

Published : Jan 20, 2022, 5:25 PM IST

Updated : Jan 20, 2022, 5:37 PM IST

Australian open Sania mirza: ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో భాగంగా నేడు(గురువారం) జరిగిన మిక్స్​డ్​ డబుల్స్​ పోటీల్లో సానియా మీర్జా-రాజీవ్​ రామ్(అమెరికా)​ జోడీ విజయాన్ని అందుకుంది. తొలి రౌండ్​లో సెర్బియా ద్వయం అలెక్సంద్రా క్రునిక్(Aleksandra krunic)​-నికోలా(nicola cacic)ను వరుస సెట్లలో 6-3, 7-6(3) తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్​ 69 నిమిషాల పాటు సాగింది. ఈ మ్యాచ్​ విజయంలో రామ్​ కీలకంగా వ్యవహరించాడు. అతడు 2021లో బార్బొరాతో(Barbora Krejcikova) కలిసి మిక్స్​డ్​ డబుల్స్​లో టైటిల్​ను దక్కించుకున్నాడు.

సింగిల్స్​లో తొలి రౌండ్​లో నెగ్గిన బ్రిటన్​ టెన్నిస్​ ఆటగాడు ఆండీ ముర్రే నేడు జరిగిన రెండో రౌండ్​లో ఓటమి పాలయ్యాడు. 120వ ర్యాంకు టారో డేనియల్​(taro daniel) చేతిలో 6-4,6-4,6-4 తేడాతో పరాజయం చెందాదు.

ఇక రెండో రౌండ్​లో నెగ్గిన మరో రష్యా కుర్రాడు మెద్వెదెవ్​ మూడో రౌండ్​కు చేరుకున్నాడు. నిక్​ను(nick kyrgios) 7-6(1),6-4,4-6,6-2తేడాతో ఓడించాడు. ఈ టోర్నీలో వరుసగా మూడు రౌండ్లు గెలిచి నాలుగో రౌండ్​కు చేరుకోవడం ఇతడికిది నాలుగో సారి.

యూఎస్​ ఓపెన్​ ఛాంపియన్​, బ్రిటీష్​ అమ్మాయి ఎమ్మా రాడుకానుకు ఊహించని షాక్​ ఎదురైంది. 98వ ర్యాంకర్​ డంకా కోవినిక్​ చేతిలో 6-4,4-6,6-3 తేడాతో రెండో రౌండ్​లోనే ఇంటిదారి పట్టింది.

ఇదీ చూడండి: సానియా మీర్జా రిటైర్మెంట్.. ఈ నిర్ణయం ఇప్పుడే ఎందుకు?

Last Updated : Jan 20, 2022, 5:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.