ETV Bharat / sports

సానియా శకం ముగిసె.. ఓటమితో కెరీర్​కు గుడ్​బై

author img

By

Published : Feb 21, 2023, 9:19 PM IST

Updated : Feb 21, 2023, 10:42 PM IST

టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా కెరీర్​ ముగిసింది. ఓటమితో తన ప్రయాణాన్ని ముగించింది. తాజాగా జరిగిన దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ 1000 సిరీస్‌ ఛాంపియన్‌షిప్​లో ఆమె తొలి పోరులోనే ఓటమి చెందింది.

Sania Mirza retirement
సానియా కెరీర్​ ముగిసింది.. ఓటమితో

భారత టెన్నిస్‌ చరిత్రలో ఓ సువర్ణ అధ్యాయం ముగిసింది. రెండు దశబ్దాల పాటు తన ఆటతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా కెరీర్​ ముగిసింది. ప్రస్తుతం జరుగుతున్న దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ డబ్ల్యూటీఏ 1000 సిరీస్‌ ఛాంపియన్‌షిప్​లో పాల్గొన్న ఆమె తన ప్రయాణాన్ని ఓటమితో ముగించింది. ఈ పోరులో మిక్స్​డ్​ డబుల్స్​ విభాగంలో తన అమెరికన్​ పార్ట్నర్ క్రీడాకారిణి​ మెడిసన్​ కీస్​తో బరిలో దిగిన ఆమె.. రష్యన్​ జోడీ వెరోనికా సంసోనోవా చేతితో ఓడిపోయింది. 4-6,0-6 తేడాతో పరాజయం చెందింది. ఇక కెరీర్‌లో చివరి టోర్నీ ఆడిన సానియా ఓటమి అనంతరం కన్నీటి పర్యంతరమైంది.

ఇకపోతే ఈ ఏడాది జనవరిలో టెన్నిస్‌కు సానియా రిటైర్మెంట్​ ప్రకటించిన విషయం తెలిసిందే. 36ఏళ్ల సానియా.. తన 20 సంవత్సరాల సుదీర్ఘ కెరీర్‌లో 6 డబుల్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ను ముద్దాడింది. 2003లో అంతర్జాతీయ ఆటలోకి అరంగేట్రం చేసిన సానియా మీర్జా 2005లో తొలిసారి ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌తో తన ప్రొఫెషనల్‌ కెరీర్‌ను ఆరంభించింది. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో ఉమెన్స్ సింగిల్స్‌లో రజతం గెలిచింది. సింగిల్స్‌లో గరిష్ఠంగా 27వ ర్యాంకును సాధించిన సానియా.. 2015లో డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌ వన్‌ ర్యాంకును పొందింది.

ఇకపోతే గతేడాది రిటైర్‌మెంట్‌ను ప్రకటించిన సమయంలో తనకు అండగా నిలిచిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది. తల్లిదండ్రులు, కోచ్‌, ఫిజియో, మొత్తం టీమ్​ మద్దతు లేకపోయి ఉంటే కెరీర్‌లో ఈ ఉన్నత స్థాయి వరకు వచ్చేదాన్ని కాదంటూ ఎమోషనల్​ అయింది. ఇక ఆమె పర్సనల్​ లైఫ్​ విషయానికొస్తే.. 2010లో పాక్ క్రికెటర్ సోయబ్ మాలిక్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి 2018లో సానియా మీర్జాకు ఇజాన్‌ జన్మించాడు. ప్రస్తుతం నాలుగేళ్ల కొడుకుతో దుబాయ్‌లో ఉంటోంది. అక్కడే టెన్నిస్ అకాడమీని ప్రారంభించింది.

ఇక ఈ ఆఖరి మ్యాచ్​ ఆడేముందు సానియా మాట్లాడుతూ.. "ఇకపై పోటీపడడం, గెలవడం, పోరాడడం వల్ల కలిగే అనుభూతిని నేను కోల్పోతా. పెద్ద కోర్టుల్లో ఆడియెన్స్​ కేరింతల మధ్య అడుగుపెడుతున్నప్పుడు కలిగే మజానే వేరు. ఇకపై అది ఉండదు. అన్నింటికంటే ముఖ్యంగా పోటీకి దూరమయిపోతా. అది చాలా పెద్ద కష్టం. పెద్ద వెలితి. రిటైర్మెంట్‌ తర్వాత నేనేం చేసినా పోటీపడడం వల్ల కలిగే అనుభూతి ఇక దేని వల్ల కలగదు" అని చెప్పుకొచ్చింది.

ఇదీ చూడండి: కోహ్లీకి లిప్​లాక్​ ఇచ్చిన లేడీ ఫ్యాన్​​.. వీడియో వైరల్​

Last Updated : Feb 21, 2023, 10:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.