Saina Nehwal Retirement : 2024 పారిస్ ఒలింపిక్స్‌కు ముందు భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ కీలక వ్యాఖ్యలు చేసింది. వచ్చే ఏడాది పారిస్‌లో జరగనున్న ఒలింపిక్స్ పోటీలకు అర్హత సాధించేందుకు ఆమెకు తక్కువ అవకాశాలున్నప్పటికీ.. ఇప్పట్లో ఆటకు రిటైర్మెంట్ ఇచ్చే ఆలోచన లేదని పేర్కొంది. గాయం కారణంగా గత కొద్ది కాలం నుంచి ఆటకు దూరంగా ఉంటున్న క్రమంలో సైనా.. ఈ వాఖ్యలు చేసింది.
"ప్రస్తుతం గంట లేదా రెండు గంటలపాటు ప్రాక్టీస్ చేయగానే నా మోకాలిలో నొప్పి వస్తోంది. ఒలిపింక్స్ పోటీలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నేను ఆ పోటీలకు అర్హత సాధించడం చాలా కష్టం. అది నాకు తెలుసు. ఆ పోటీల్లో ప్రపంచ మేటి ప్లేయర్లు.. తై జు యింగ్, యామగుచి, ఆన్ సె యింగ్‌తో ఆడాలంటే కేవలం గంట ప్రాక్టీస్ సరిపోదు. అవి మంచి ఫలితాలను ఇవ్వవు. అందుకే పూర్తి స్థాయిలో ఫిట్నెస్ సాధించిన తర్వాతే మళ్లీ బరిలో దిగుతా. ప్రస్తుతం నా దృష్టి అంతా ఫిట్నెస్ సాధించడంపైనే ఉంది. డాక్టర్లు, ఫిజియోలు సహకారం అందిస్తున్నారు. ఇక రిటైర్మెంట్కు ఇంకా సమయం ఉంది. దానికి డెడ్‌లైన్ అంటూ ఏమీ పెట్టుకోలేదు" అని సైనా మీడియాతో తెలిపింది.
Saina Nehwal Ranking : గతంలో వరల్డ్ నెం.1 గా ఉన్న 33 ఏళ్ల హైదరాబాదీ ప్లేయర్ సైనా.. ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 55 వ స్థానంలో కొనసాగుతోంది. అయితే ఆమె చివరిసారిగా 2019లో ఇండోనేసియా మాస్టర్స్ టైటిల్ సాధించింది.
కొంత కాలంగా పేలవ ప్రదర్శన.. ఇక 2020 నుంచి సైనా ఆటతీరు చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. గతేడాది 13 బ్యాడ్మింటన్ ప్రపంచటూర్ టోర్నీల్లో పాల్గొన్న సైనా.. ఒక్కసారి మాత్రమే (సింగపుర్ ఓపెన్) క్వార్టర్ ఫైనల్స్‌కు చేరింది. ఇక ఈ ఏడాది సైనా.. 6 బ్యాడ్మింటన్ ప్రపంచటూర్లలో పాల్గొంది. అందులో మూడింట్లో తొలి రౌండ్లోనే నిష్ర్కమించగా.. మరో మూడింట్లో రెండో రౌండ్లో ఓడింది. ఇక చివరగా ఇదే ఏడాది జూన్‌లో సింగపుర్ ఓపెన్‌లో బరిలోకి దిగింది. గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేని సైనా.. మరో పది రోజుల్లో ప్రారంభమయ్యే ఆసియా క్రీడలకు సైతం దూరంగా ఉంటుంది.
-
In just 1️⃣0️⃣ days, the excitement kicks off with the dazzling opening ceremony of the #19thAsianGames! 🏟#AsianGames #Hangzhou2022 #Hangzhou #10DaysToGo pic.twitter.com/wAVQyjkzGW
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">In just 1️⃣0️⃣ days, the excitement kicks off with the dazzling opening ceremony of the #19thAsianGames! 🏟#AsianGames #Hangzhou2022 #Hangzhou #10DaysToGo pic.twitter.com/wAVQyjkzGW
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 13, 2023In just 1️⃣0️⃣ days, the excitement kicks off with the dazzling opening ceremony of the #19thAsianGames! 🏟#AsianGames #Hangzhou2022 #Hangzhou #10DaysToGo pic.twitter.com/wAVQyjkzGW
— Olympic Council of Asia (@AsianGamesOCA) September 13, 2023
PV Sindhu BWF Ranking : మెరుగుపడిన పీవీ సింధు ర్యాంక్.. 15వ స్థానంలో స్టార్ షట్లర్