భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)కు చెందిన 50 ఏళ్ల కోచ్ ఓ మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడ్డారు. ఈ కారణంగా అతడిని కోచ్ పదవి నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇతడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం తిహార్ జైళ్లో ఉంచారు.
"సిరి పోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో అథ్లెట్‌గా శిక్షణ తీసుకుంటున్న ఓ 13 ఏళ్ల బాలికపై కోచ్ వేధింపులకు పాల్పడ్డాడు. ఈ సంఘటన సాయ్ పరిధిలోది కాదు. ఓ మైనర్‌కు అతడు ప్రైవేట్‌గా శిక్షణ ఇస్తున్నాడు. ప్రస్తుతం అతడిని సస్పెండ్ చేసి ఘటనపై విచారణకు ఆదేశించాం." అని సాయ్ ఓ ప్రకటనలో తెలిపింది.