హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లర్ సుశీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. దిల్లీలోని ఛత్రశాల్ స్టేడియంలో జరిగిన హత్యకు సంబంధించి శవపరీక్ష నివేదిక బహిర్గతమైంది. బలమైన వస్తువుతో తలపై కొట్టి మల్లయోధుడు సాగర్ రానాను చంపేసినట్లు నివేదిక పేర్కొంది. తలపై బలంగా మోదడం వల్ల అతడి పెద్ద మెదడుకు గాయమైందని తెలిపింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ హత్య కేసులో రెజ్లర్ సుశీల్ ప్రత్యక్షంగా పాల్గొన్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.
సుశీల్ కాంట్రాక్టు రద్దు..!
హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్ సుశీల్ కుమార్.. సెంట్రల్ కాంట్రాక్టును తిరిగి పునరుద్ధరించే అవకాశాలు లేనట్లు తెలుస్తోంది. సుశీల్‌తో పాటు పూజా ధండాను కాంట్రాక్టు నుంచి తప్పించే అవకాశాలున్నట్లు సమాచారం. దీనిపై భారత రెజ్లింగ్ సమాఖ్య అధికారిక ప్రకటన చేయనప్పటికీ.. ఇందుకు సంబంధించిన నిర్ణయం త్వరలోనే తీసుకోనున్నారు. వీరిద్దరికీ 2019లో సెంట్రల్ కాంట్రాక్టులు దక్కాయి. అనంతరం వీరిద్దరు ప్రదర్శన చేయలేదు.
ఇదీ చదవండి: క్వారంటైన్లో పుజారా ఏం చేస్తున్నాడో తెలుసా?