దేశవ్యాప్తంగా ఉన్న ఖేలో భారత్ అథ్లెట్ల శిక్షణ, ఆహారం సహ ఇతర ఖర్చుల కోసం నిధులను విడుదల చేసింది సాయ్. 2,783మంది క్రీడాకారులకు అక్టోబర్, నవంబరు నెలలకు గానూ రూ.5.78కోట్లను కేటాయించింది. దీని ద్వారా ఈ రెండు నెలలకు ప్రతి అథ్లెట్‌కు రూ.20,786 అందాయి. వీటిని ఆటగాళ్ల శిక్షణ, ప్రయాణాలు, ఆహారం, విద్య, వసతుల కోసం మంజూరు చేసింది.
అథ్లెట్స్‌కు రోజువారి ఖర్చుల కోసం ఏటా రూ.1.20లక్షల రూపాయలను స్కాలర్‌షిప్‌గా ఇస్తోంది సాయ్. ఈ డబ్బులు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోకి జమ అవుతాయి. అందులో భాగంగానే ఈ నిధులను విడుదల చేసింది.
ఇదీ చూడండి : సాయ్‌లో బాక్సర్లకు శిక్షణ పునఃప్రారంభం