ETV Bharat / sports

ముగిసిన ఫెదరర్ శకం.. ఓటమితో ఆటకు వీడ్కోలు.. స్పీచ్ ఇస్తూ కంటతడి - రోజర్ ఫెదరర్​ టెన్నిస్​ ప్లేయర్ ఆఖరి మ్యాచ్​

Roger Federer Last Match : టెన్నిస్​ దిగ్గజం రోజర్ ఫెదరర్​ ఆటకు వీడ్కోలు పలికాడు. లావర్ కప్​ 2022లో ఆఖరి మ్యాచ్​ రఫేల్ నాదల్​తో ఆడిన అతడు.. ఓటమితో తన ప్రస్థానాన్ని ముగించాడు. మ్యాచ్​ అనంతరం జరిగిన ఇంటర్య్వూలో భాగోద్వేగానికి లోనైన ఫెదరర్​.. తన అనుభవాలను పంచుకున్నారు.

Roger Federer tennis legend
Roger Federer lost final match
author img

By

Published : Sep 24, 2022, 10:54 AM IST

ప్రపంచ పురుషుల టెన్నిస్‌లో ఓ శకం ముగిసింది. తన అద్భుత ఆటతీరుతో, అసాధారణ ప్రదర్శనతో దాదాపు రెండున్నర దశాబ్దాల పాటు టెన్నిస్‌ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వీరుడు రాకెట్​ చివరి మజిలీ పూర్తయింది. 24 ఏళ్ల పాటు సుదీర్ఘంగా సాగిన తన కెరీర్‌కు తెరదించుతూ.. 41 ఏళ్ల వయసులో రోజర్‌ ఫెదరర్‌ ప్రొఫెషనల్‌ టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు.

20 విజయాలతో పురుషుల సింగిల్స్‌లో అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న అతను శనివారం అతడి కెరీర్ చివరి మ్యాచ్​ ఆడాడు. లావెర్​ కప్​ 2022లో రోజర్ ఫెదరర్​-రఫేల్​ నాదల్ ద్వయం​, అమెరికాకు చెందిన జాక్ సోక్-ఫ్రాన్స్​ టిఫో డబుల్స్​ మధ్య జరిగిన మ్యచ్​లో ఫెదర్​-నాదల్ ద్వయం ఓటమి పాలైంది. దీంతో ఆఖరి మ్యాచ్​ ఓడిపోయి.. ఆటకు వీడ్కోలు పలికాలు ఫెదరర్​.

ఫెదరర్​.. రఫేల్ నాదల్​తో జతకట్టి మంచి ప్రదర్శన చేశాడు. మ్యాచ్​లో మొదటి సెట్ గెలిచి శుభారంభం చేశారు. కానీ సెకండ్​ సెట్​లో అమెరికన్లు పుజుకున్నారు. దీంతో సమం అయింది. ఉత్కంఠ భరితంగా జరిగిన మూడో సెట్​లో ఫెదరర్ ద్వయం ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం రోజర్​ ఫెదరర్​ భాగోద్వేగానికి గురయ్యాడు. తన చిరకాల ప్రత్యర్థి, మిత్రుడు రఫాల్ నాదల్​ను కౌగిలించుకున్నాడు. ప్రేక్షకులు స్టేడియాన్ని హోరెత్తించారు. అనంతరం ఇంటర్వ్యూ పాయింట్​ వద్దకు వెళ్లి కూర్చున్నాడు. అతడు భావోద్వేగాన్ని ఆపుకోలేక పోయాడు. ఇంటర్వ్యూ జరిగే టప్పుడు అతడి కళ్లలో నీళ్లు తిరిగాయి. "దీన్నుంచి (రిటైర్మెంట్ బాధ గురించి) ఎలాగైనా బయటపడతాం కదా? ఇప్పుడైతే సంతోషంగానే ఉన్నా. బాధ లేదు. చివరిసారిగా టెన్నిస్ ఆడటాన్ని ఎంజాయ్ చేశా. మ్యాచ్ గొప్పగా సాగింది. ఇంతకంటే ఆనందం ఇంకోటి లేదు. అద్భుతంగా ఉంది. ఒకే టీమ్​లో నాదల్​తో ఆడటం బాగుంది. ఇక్కడికి వచ్చిన అందరికీ, లెజెండరీ ప్లేయర్స్​ అందిరికీ నా కృతజ్ఞతలు" అని మ్యచ్​ అనంతరం రోజర్ ఫెదరర్​ మాట్లాడాడు.

ఫెదరర్​, తల్లిదండ్రులు, భార్య మిర్కా.. పిల్లలు కోర్టులోకి వచ్చి.. అతడితో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "నేను ఎప్పుడూ టీమ్​ ప్లేయర్​ గానే ఫీల్ అయ్యాను. సింగిల్స్​ ఎప్పుడూ అలా చేయరు. కానీ నాకు ఒక టీమ్ ఉంది. వాళ్లు నేను ఎ్పప్పుడు ఎక్కడికి వెళ్లినా నా వెంట వచ్చారు. వాళ్లతో నా ప్రయాణం అద్బుతం. వాళ్లందరికీ నా ధన్యవాదాలు. అలాగే.. నేను యాండీ, థామస్, క్యామ్​, స్టెఫనోస్, నాదల్, క్యాస్పర్.. ఇంకా ఇతర టీమ్​లు. మీరంతా చాలా అద్భుతమైన వ్యక్తులు. మీతో ఇన్ని లావేర్​ కప్​లు ఆడినందుకు గర్వంగా ఉంది. ఇది నాకొక వేడుకలా ఉంది. ఇలా చాలా అనందంగా ఆటకు వీడ్కోలు పలకాలనుకున్నా.. ఇప్పుడు అది నేను అనుకున్నట్టే జరిగింది. అందరికీ కృతజ్ఞతలు" భావోద్వేగంతో ఫెదరర్​ మట్లాడారు.

రోజర్ ఫెదరర్​ 103 టూర్​ లెవెల్​ టైటిళ్లు సాధించాడు. ఏటీపీ ర్యాంకింగ్స్​లో 310 వారాల పాటు అత్యుత్తమ స్థానంలో ఉన్నాడు. ఫెదర్ తన ప్రత్యర్థి రఫేల్​​తో 2004లో మియామీలో జరిగిన ఏటీపీ మాస్టర్స్​ 1000 ఈవెంట్​లో ​మొదటిసారి తలపడ్డాడు. ఇప్పటివరకు ఇద్దరు మొత్తంగా 39 సార్లు తలపడితే.. అందులో 24 సార్లు వివిధ టోర్నమెంట్ల ఫైనల్స్​లో బరిలోకి దిగారు.

తన కుటుంబ గురించి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. "నేను అక్కడికి వెళ్లిపోవాలా?(నవ్వుతూ).. ఇప్పటివరకు నేను చేసింది ఓకే. ఇంతకముందు నేను ఎక్కువ మాట్లడలేదు. కానీ ఇప్పుడు కొంచెం మెరుగయ్యాను. నా భార్యా నాకు చాలా సపోర్ట్​ చేసింది. ఆమె అనుకుంటే ఎప్పుడో నేను ఆడకుండా ఆపేది.. కానీ అలా చేయలేదు. నన్ను ఎక్కడికైనా వెళ్లి ఆడేందుకు సపోర్ట్​ చేస్తుండేది" అని చెప్పాడు.

రోజర్ ఫెదరర్​ సాధించిన రికార్డ్​లు:

  • 20

కెరీర్‌లో రోజర్‌ సాధించిన గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు 20. అత్యధికంగా ఎనిమిది వింబుల్డన్‌ టైటిళ్లు గెలిచిన అతడు.. ఆరు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌, అయిదు యుఎస్‌ ఓపెన్‌, ఒకే ఒక్క ఫ్రెంచ్‌ ఓపెన్‌ నెగ్గాడు. 2012లో రోజర్‌ 17 గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు సాధించే సమయానికి నాదల్‌ (10), జకోవిచ్‌ (5) అతడికి చాలా దూరంలో ఉన్నారు. ఆ తర్వాత మూడు ట్రోఫీలు గెలవడానికి సమయం తీసుకున్నాడు. 2018లో చివరిగా ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ రూపంలో ఫెదరర్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ నెగ్గాడు.

  • 30

ఫెదరర్‌ ఆడిన గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌. 43సార్లు సెమీస్‌, 52సార్లు క్వార్టర్స్‌ చేరాడు.

  • 103

గెలిచిన ఏటీపీ టైటిళ్లు. అత్యధిక ఏటీపీ ట్రోఫీల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. జిమ్మి కానర్స్‌ (109) ముందున్నాడు.

  • 310

ర్యాంకింగ్స్‌లో రోజర్‌ నంబర్‌వన్‌గా ఉన్న వారాలు. 2021లో జకోవిచ్‌ అధిగమించే వరకు అత్యధిక వారాలు నంబర్‌వన్‌గా ఉన్న రికార్డు అతడిదే. 2004లో తొలిసారి నంబర్‌వన్‌ అయిన అతడు. 2008 వరకు కొనసాగాడు. ఆ తర్వాత మరో మూడు దఫాలు (2009, 2012, 2018) ఈ ర్యాంకు దక్కించుకున్నాడు. పురుషుల్లో, మహిళల్లో కలిపి వరుసగా అత్యధిక వారాలు (237) నంబర్‌వన్‌గా నిలిచిన ఘనత రోజర్‌దే. పెద్ద వయస్కుడైన (36 ఏళ్లు) నంబర్‌వన్‌ కూడా అతడే.

  • 1

వింబుల్డన్‌, యుఎస్‌ ఓపెన్‌ను నాలుగేళ్లు (2004-2007) వరుసగా గెలిచిన ఏకైక ఆటగాడు. ఫెదరర్‌ ఖాతాలో రెండు ఒలింపిక్స్‌ పతకాలు ఉన్నాయి. 2008 బీజింగ్‌లో డబుల్స్‌ స్వర్ణం గెలిచిన అతడు.. 2012 లండన్‌ క్రీడల్లో సింగిల్స్‌ రజతం సాధించాడు.

ఇవీ చదవండి: బాల్​బాయ్​గా మొదలుపెట్టి.. దిగ్గజ ప్లేయర్​గా ఎదిగి.. ఫెదరర్ విజయ ప్రస్థానం

అందుకే.. మైదానంలో అంత కూల్​గా కనిపిస్తా: ధోనీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.