దేశవ్యాప్తంగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపాదే హవా. రాజస్థాన్‌లోని జైపుర్ గ్రామీణం నుంచి భాజపా తరఫున పోటీ చేసిన రాజ్యవర్థన్ సింగ్ రాఠోడ్ విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచిన కృష్ణ పూనియా ప్రజల మద్ధతు సాధించలేకపోయారు. వీరిద్దరూ 2013లోనే రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం.
ఒలింపిక్స్‌లో వెండి పతకం సాధించిన రాజ్యవర్ధన్ సింగ్.. భారత సైన్యంలో కల్నల్‌గా పనిచేస్తుండేవారు. 2013లో స్వచ్ఛంద పదవి విరమణ తీసుకుని భాజపాలో చేరారు. అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా జైపుర్ గ్రామీణం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీపీ జోషిపై 3.32 లక్షల ఓట్ల తేడాతో గెలుపొందారు.
జైపుర్ గ్రామీణంలో అధికంగా ఉండే జాట్ వర్గ ఓటర్లు ఈ ఎన్నికల్లో ప్రధాన పాత్ర పోషించారు. సాధారణంగా వారు కాంగ్రెస్‌కు వ్యతిరేకం కావడం.. రాజ్యవర్ధన్ గెలుపునకు కారణమైంది.