PV Sindhu US Open : భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి పరాజయాన్ని చవి చూసింది. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్లో చైనాకు చెందిన గావో ఫాంగ్ జీ చేతిలో 22-20, 21-13 తేడాతో సింధు ఓడింది. అయితే ప్రపంచ 36వ ర్యాంకర్ గావో ఫాంగ్ జీ.. తొలి గేమ్‌ను గెలవడానికి కష్టపడినప్పటికీ.. రెండో గేమ్‌ను మాత్రం సులువుగానే నెగ్గగలిగింది. ఇక అంతకుముందు గురువారం జరిగిన పోటీల్లో తైవాన్‌కు చెందిన సంగ్ షువో యున్‌పై సింధు అలవోకగా గెలుపొందింది. వరుసగా రెండు సెట్లలో ఆధిపత్యం చెలాయించి 21-14, 21-12తో సంగ్ షువోను చిత్తుగా ఓడించింది. ఇకపోతే ఇటీవలే ముగిసిన కెనడా ఓపెన్ సెమీఫైనల్స్‌లోనూ సింధు ఓటమిపాలైంది. జపాన్‌కి చెందిన యమగుచి చేతిలో పరాజయాన్ని చవి చూసింది. గత మార్చిలో జరిగిన మాడ్రిడ్ ఓపెన్‌లో మాత్రమే ఫైనల్స్ వరకు చేరగలిగింది.
Lakshya Sen US Open :మరోవైపు యువ ప్లేయర్ లక్ష్యసేన్ తన జోరును కొనసాగిస్తున్నాడు. ఇటీవలే కెనడా ఓపెన్‌ను గెలిచి దూకుడు మీదున్న లక్ష్యసేన్ యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలోనూ సెమీస్‌కు చేరుకున్నాడు. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో మరో భారత ప్లేయర్ శంకర్ ముత్తుస్వామిపై 21-10, 21-17తో వరుస సెట్లలో గెలిచి సెమీస్‌కు చేరుకున్నాడు లక్ష్యసేన్. ఇటీవలే కెనడా ఓపెన్ ఫైనల్లో చైనా ఆటగాడు.. ఆల్ ఇంగ్లాండ్ ఛాంపియన్ లీ షి ఫెంగ్‌ని ఓడించి టైటిల్ నెగ్గిన లక్ష్యసేన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ సంవత్సరంలో సేన్‌కి అదే మొదటి టైటిల్ కడా. ఈ క్రమంలో యూఎస్ టైటిట్‌ను గెలవాలని కసితో ఉన్నాడు.
US ఓపెన్ 2023లో పాల్గొన్న భారత జట్టు..
పురుషుల సింగిల్స్
మెయిన్ డ్రా: లక్ష్య సేన్, బి సాయి ప్రణీత్
క్వాలిఫయర్స్: ఎస్ శంకర్ ముత్తుసామి సుబ్రమణియన్, పారుపల్లి కశ్యప్
మహిళల సింగిల్స్
మెయిన్ డ్రా: పీవీ సింధు, గద్దె రుత్విక శివాని
క్వాలిఫైయర్స్: ఇమాద్ ఫరూకీ సమియా
పురుషుల డబుల్స్
మెయిన్ డ్రా: కృష్ణ ప్రసాద్ గరగ/విష్ణువర్ధన్ గౌడ్ పంజాల
మహిళల డబుల్స్
మెయిన్ డ్రా: అపేక్ష నాయక్/రమ్య చిక్‌మెనహల్లి వెంకటేష్, రుతపర్ణ పాండా/శ్వేతపర్ణ పాండా