ETV Bharat / sports

కీలక పోరుకు సింధు, నీరజ్‌ సిద్ధం

ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ సుదిర్మన్‌ కప్‌కు వేళైంది. సుదిర్మన్‌ కప్‌లో స్టార్‌ షట్లర్లు పి.వి.సింధు, హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ల సారథ్యంలో భారత జట్టు బరిలో దిగనుంది. అలాగే దోహా డైమండ్‌ లీగ్‌ టైటిల్‌తో ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టిన భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా త్వరలో మరో పోటీకి రెడీ అవుతున్నాడు. ఆ వివరాలు..

PV Sindhu Neeraj chopra
కీలక పోరుకు సింధు, నీరజ్‌ సిద్ధం
author img

By

Published : May 14, 2023, 10:30 AM IST

Updated : May 14, 2023, 11:09 AM IST

PV Sindhu Sudirman Cup 2023 భారత బ్యాడ్మింటన్​ జట్టుకు సవాల్​. ప్రతిష్ఠాత్మక బీడబ్ల్యూఎఫ్‌ సుదిర్మన్‌ కప్‌కు వేళైంది. ఈ ప్రపంచ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఇప్పటి వరకు పతకం సాధించని భారత్‌.. ఈసారి బోణీ కొట్టాలని చాలా పట్టుదలగా ఉంది. అందుకే తొలి పతకమే లక్ష్యంగా బలంగా బరిలోకి దిగబోతుంది భారత్‌. ఆదివారం(మే 15) మరి కాసేపట్లో చైనీస్‌ తైపీతో జరగబోయే పోరుతో టోర్నీని ప్రారంభించనుంది. నిరుడు థామస్‌ కప్‌లో మెన్స్ టీమ్​ విజేతగా నిలవడం.. ఈ ఏడాది ఆరంభంలో ఆసియా మిక్స్‌డ్‌ టీమ్‌ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుపొందడం వల్ల భారత్‌పై అంచనాలు పెరిగాయి.

మలేసియా, చైనీస్‌ తైపీతో కలిసి గ్రూప్‌ 'సి'లో భారత్‌ ఉంది. గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్‌కు అర్హతను సాధిస్తాయి. సింగిల్స్‌లో పీవీ సింధు, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ కీలకం కానున్నారు. డబుల్స్‌లో సాత్విక్‌- చిరాగ్‌, గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ జోడీలపై మంచి అంచనాలున్నాయి.

అయితే భారత్‌కు తమ తొలి పోరులోనే కఠిన సవాలు ఎదురు కానుంది. ఒలింపిక్‌ రజత విజేత తై జు సారథ్యంలోని చైనీస్‌ తైపీ బలంగా కనపడుతోంది. మహిళల సింగిల్స్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌ అయిన తై జుతో సింధు పోటీ పడే ఛాన్స్​ ఉంది. వీరిద్దరు 22 మ్యాచ్‌ల్లో తలపడగా.. సింధు 17 సార్లు ఓడింది.

పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఐదో ర్యాంకర్‌ టియాన్‌ చెన్‌తో.. తొమ్మిదో ర్యాంకర్‌ ప్రణయ్‌ తలపడొచ్చు. మొత్తంగా చూసుకుంటే చెన్‌తో మ్యాచ్‌ల్లో 3-5తో ప్రణయ్‌ వెనుకబడి ఉన్నాడు. కానీ గత మూడు మ్యాచ్‌ల్లో అతడిపై రెండు సార్లు విజయం సాధించడం ప్రణయ్‌కు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. పురుషుల డబుల్స్‌లో లీ యాంగ్‌- వాంగ్‌తో సాత్విక్‌- చిరాగ్‌, మహిళల డబుల్స్‌లో లీ చియా- తెంగ్‌ చున్‌తో గాయత్రి- ట్రీసా, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో హాంగ్‌ వీ- లీ చియాతో సాయి ప్రతీక్‌- అశ్విని పొన్నప్ప తలపడనున్నారు.

FBK games Neeraj chopra​.. దోహా డైమండ్‌ లీగ్‌ టైటిల్‌తో ఈ సీజన్‌ను ఘనంగా మొదలుపెట్టిన భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా త్వరలో మరో పోటీకి రెడీ అవుతున్నాడు. జూన్‌ 4న నెదర్లాండ్స్‌ హెంగ్లో వేదికగా జరిగే ఫానీ బ్లాంకర్స్‌ కొయెన్‌ (ఎఫ్‌బీకే) క్రీడల్లో పోటీపడనున్నాడు. 1948 లండన్‌ ఒలింపిక్స్‌లో నాలుగు గోల్డ్ సాధించిన ఫానీ బ్లాంకర్స్‌ పేరిట ఈ కాంటినెంటల్‌ మీట్‌ను నిర్వహిస్తున్నారు.

డైమండ్‌ లీగ్‌లో భాగంగా దోహా తొలి అంచె టోర్నీలో 88.67 మీటర్ల త్రోతో గోల్డ్ మెడల్ దక్కించుకున్న చోప్రా ప్రస్తుతం మంచి జోరు మీదున్నాడు. అయితే ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ నుంచి నీరజ్‌కు గట్టిపోటీ ఎదురయ్యే అవకాశాలున్నాయి. దోహా మీట్‌లో.. పీటర్స్‌ 85.88 మీటర్ల త్రోతో కాంస్యం దక్కించుకున్నాడు. గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్‌ను వెనక్కి నెట్టి అండర్సన్‌ స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే ఎఫ్‌బీకే టోర్నీ తర్వాత జూన్‌ 27న చెక్‌ రిపబ్లిక్‌లో జరిగే ఆస్ట్రావా గోల్డెన్‌ స్పైక్‌ టోర్నీలోనూ చోప్రా పోటీపడనున్నాడు. ప్రస్తుతం అతడు టర్కీలోని ఆంటల్యాలో శిక్షణ పొందుతున్నాడు.

ఇదీ చూడండి: IPL 2023 PBKS VS DC : పంజాబ్‌ హీరో ప్రభ్‌ సిమ్రన్‌ సింగ్​.. మ్యాచ్​ హైలైట్​ ఫొటోస్​ చూశారా?

Last Updated : May 14, 2023, 11:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.