PUBG recognition news: భారత్‌లో పబ్జీ మొబైల్ గేమ్‌కు ఎటువంటి గుర్తింపును ఇవ్వలేదని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా స్పష్టం చేశారు. చట్టానికి, దేశానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకోబోమని తెలిపారు. ఇటువంటి ప్రమాదకర ఆటను ప్రోత్సహించమని పేర్కొన్నారు.
కేంద్ర ఐటీ శాఖకు, భారత ఒలింపిక్ సంఘానికి.. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఇటీవల లేఖ రాసింది. పబ్జీను భారత్‌లో నిషేధం విధించినా ఎలా డౌన్లోడ్ అవుతోందని ఈ లేఖలో ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో నరీందర్ వివరణ ఇచ్చారు.
ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్‌కు లేఖ రాశాం. వారి నుంచి వివరణాత్మక సమాధానాన్ని కోరుకుంటున్నాం. మాకు ఐటీ శాఖ నుంచి సమాధానం కావాలి. పబ్జీ లాంటి ఆటలు పిల్లల్లో హింసను ప్రోత్సహించేలా ఉన్నాయి. ఇలాంటి ఆటలను నిషేధించాలి. ఇది చాలా తీవ్రమైన సమస్య. దీన్ని జాగ్రత్తగా పరిష్కరించాలి.
-ప్రియాంక కనూంగో, ఎన్సీపీసీఆర్ ఛైర్పర్సన్
16 ఏళ్ల కుర్రాడు పబ్జీకి బానిసై కన్నతల్లిని కాల్చి చంపేశాడు. అనంతరం 10 ఏళ్ల సోదరిని గదిలో బంధించి తల్లి మృతదేహం వద్దే కూర్చున్నాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో జూన్8న జరిగింది. మొబైల్ గేమ్ పబ్జీ వల్ల ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి.
ఇవీ చదవండి: ఇంగ్లాండ్‌కు భారీ షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లు, ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో కోత
ఇంగ్లాండ్‌కు టీమ్ఇండియా.. ఆఖరి టెస్టులో కొత్త కెప్టెన్లతో బరిలోకి