భారత పరుగుల రాణి, మాజీ స్ప్రింటర్ పీటీ ఉష అంతర్జాతీయ అథ్లెట్ ఫెడరేషన్(ఐఏఏఎఫ్) వెటరన్ పిన్‌కు నామినేట్ అయ్యారు. క్రీడా సమాజానికి ఆమె చేసిన విశిష్ట సేవలకుగాను ఈ గౌరవంతో సత్కరించారు. ఈ విషయాన్ని ఐఏఏఎఫ్ సీఈవో జాన్ రిడ్జ్యాన్ తెలిపారు.
"మిమ్మల్ని (పీటీ ఉష) నామినేట్ చేస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. అథ్లెటిక్స్‌లో మీరు చేసిన సేవలు మరపురానివి. సెప్టెంబరులో ఖతార్‌లో జరగనున్న ఐఏఏఎఫ్ కాంగ్రెస్ అవార్డు వేడుకకు ఆహ్వానిస్తున్నాం" -జాన్ రిడ్జ్యాన్, ఐఏఏఎఫ్ సీఈఓ
ఈ గౌరవం దక్కడం తనకు ఎంతో ఆనందంగా ఉందని పీటీ ఉష ట్వీట్ చేశారు.
"ఐఏఏఎఫ్ నన్ను నామినేట్ చేయడం నాకు దక్కిన అమూల్యమైన గౌరవంగా భావిస్తా. అందుకు కృతజ్ఞతలు చెబుతున్నాను" -పీటీ ఉష, భారత మాజీ అథ్లెట్
భారత్‌లో ఉన్న అతితక్కువ మంది అథ్లెట్లలో పీటీ ఉష ముందుంటారు. ఆమె 5 విభిన్న విభాగాల్లో ఐదు స్వర్ణాలు సాధించారు. 100 మీటర్లు, 200మీ, 400మీ, 400మీ హర్డిల్స్, 4x400 రిలేలో పసిడి సొంతం చేసుకున్నారు.
1985 జకార్తా ఆసియా క్రీడల్లో కాంస్యం నెగ్గారు. భారత్ నుంచి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి మహిళా అథ్లెట్‌గా రికార్డు సృష్టించారు. 400 మీటర్ల హర్డిల్స్‌లో త్రుటిలో(0.01 సెకండ్ల వ్యవధిలో) కాంస్యం చేజార్చుకున్నారు.
ఇది చదవండి: ఆ సిక్స్ చూసి ప్రాణాలు విడిచిన నీషమ్ కోచ్