ETV Bharat / sports

భారత బాక్సర్ల విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ నో! - డీజీసీఏ

భారత స్టార్​ బాక్సర్​ మేరీ కోమ్​ సహా 31 మంది బాక్సర్ల విమానం ల్యాండింగ్​కు దుబాయ్​ అనుమతి నిరాకరించింది. దీంతో 45 నిమిషాల పాటు యూఏఈ గగనతలంలోనే స్పైస్ జెట్ విమానం చక్కర్లు కొట్టింది.

meri kom, indian wrestler
మేరీ కోమ్, భారత స్టార్ రెజ్లర్
author img

By

Published : May 22, 2021, 5:35 PM IST

Updated : May 22, 2021, 6:05 PM IST

ఆసియన్​ బాక్సింగ్ ఛాంపియన్​షిప్స్ పోటీల​ కోసం భారత బాక్సర్ల బృందం దుబాయ్ చేరుకుంది. అయితే వీరిని చేరవేసిన స్పైస్​జెట్ విమానం ల్యాండిగ్​కు దుబాయ్​ విమానాశ్రయ అధికారులు తొలుత అనుమతి ఇవ్వలేదు. దీంతో విమానం 45 నిమిషాల పాటు గాలిలోనే చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ఈ మొత్తం ఘటనపై విచారణ జరపాల్సిందిగా డైరెక్టరేట్​ జనరల్​ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.

కొవిడ్ నిబంధనల కారణంగా బాక్సర్లు ప్రయాణించడానికి ప్రత్యేక అనుమతులు ఇచ్చింది యూఏఈ ప్రభుత్వం. దీంతో భారత బాక్సర్లు మేరీకోమ్​తో పాటు 30 మంది బృందం స్పైస్​జెట్​ విమానంలో దుబాయ్​కు వెళ్లారు. సమాచార లోపంతో యూఏఈ విమానాశ్రయ పరిధి లోపల విమానం ల్యాండింగ్​కు అనుమతించలేదు అక్కడి అధికారులు. అందుకు కారణం ఇంధన అత్యవసర పరిస్థితిని ప్రకటించడమే కారణమని తాజాగా స్పష్టం చేశారు.

ఈ నెల 24 నుంచి జూన్​ 1 వరకు ఈ పోటీలు జరగనున్నాయి. టోక్యో ఒలింపిక్స్​కు ముందు జరగనున్న చివరి టోర్నీ ఇదే.

ఇదీ చదవండి: 'అసలు మాకు కరోనా ఎలా అంటుకుందో'

Last Updated : May 22, 2021, 6:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.