ETV Bharat / sports

PM Modi Congratulates Neeraj Chopra : గోల్డ్ మెడలిస్ట్ 'నీరజ్'​పై ప్రశంసల వర్షం.. అభినందనలు తెలిపిన ప్రధాని మోదీ - నీరజ్ చోప్రా ఒలింపిక్స్ మెడల్స్

PM Modi Congratulates Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​ 2023లో స్వర్ణ పతకం సాధించిన నీరజ్​ చోప్రాను.. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సహా పలువురు ప్రముఖులు అభినందించారు. స్వర్ణ పతకం సాధించినందుకు సంతోషంగా ఉందని నీరజ్ చోప్రా తల్లిదండ్రులు తెలిపారు.

PM Modi Congratulates Neeraj Chopra
PM Modi Congratulates Neeraj Chopra
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 28, 2023, 3:55 PM IST

Updated : Aug 28, 2023, 6:59 PM IST

PM Modi Congratulates Neeraj Chopra : ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో స్వర్ణ పతకం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్​ చోప్రాను.. ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. అంకితభావం, కచ్చితత్వమే నీరజ్​ చోప్రాను ప్రపంచ ఛాంపియన్​గా నిలిపాయని ఆయన అన్నారు. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (President Droupadi Murmu) సైతం నీరజ్ చోప్రాను అభినందించారు. ప్రపంచ ఛాంపియన్​గా నిలిచిన నీరజ్​ను చూసి భారతదేశం గర్విస్తోందని తెలిపారు. అతడి విజయాన్ని చూసి దేశంలోని లక్షలాది మంది యువత స్ఫూర్తి పొందుతారని అన్నారు. ఇలాంటి విజయాలతో నీరజ్​.. మరింత ఎదగాలని కోరుకుంటున్నట్లు ముర్ము తెలిపారు.

  • The talented @Neeraj_chopra1 exemplifies excellence. His dedication, precision and passion make him not just a champion in athletics but a symbol of unparalleled excellence in the entire sports world. Congrats to him for winning the Gold at the World Athletics Championships. pic.twitter.com/KsOsGmScER

    — Narendra Modi (@narendramodi) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Neeraj Chopra adds yet another golden page to the history of Indian sports by becoming the first ever Indian to win a gold medal in World Athletics Championships. His superlative performance in the javelin throw finals at Budapest will inspire millions of our youth.

    — President of India (@rashtrapatibhvn) August 28, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ప్రపంచ అథ్లెటిక్స్​ వేదికపై త్రివర్ణ పతాకం రెపరెపలాడిన ఈరోజు భారత్​కు ముఖ్యమైన రోజు" అని రిలయన్స్​ ఫౌండేషన్స్​ ఛైర్​పర్సన్ నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. నీరజ్​ చోప్రా స్వర్ణ పతకం సాధించడం తమ కుటుంబానికి, దేశానికి బంగారు క్షణమని నీరజ్ తండ్రి సతీష్​ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తమ కుమారుడు ఈ విజయంతో దేశానికి గుర్తింపు తెచ్చాడని నీరజ్​ తల్లి సరోజ్​ దేవి అన్నారు.

Neeraj Chopra World Championship : ఆదివారం హంగేరీలోని బుడాపెస్ట్​లో జరిగిన ఛాంపియన్​షిప్​లో పురుషుల జావెలిన్​ ఫైనల్​లో నీరజ్​ చోప్రా పసిడిని ముద్దాడాడు. లిఫయర్స్​లో తొలి ప్రయత్నంలోనే నీరజ్​ చోప్రా.. బల్లెంను 88.77 మీటర్ల దూరం విసిరి నేరుగా ఫైనల్స్​కు అర్హత సాధించారు. ఫైనల్స్​లో మొదటి ప్రయత్నంలో విఫలమైన నీరజ్..​ రెండోసారి జావెలిన్​ను 88.17 మీటర్లు విసిరి ప్రపంచ ఛాంపియన్​గా అవతరించాడు.

దీంతో ప్రపంచ అథ్లెటిక్స్​ ఛాంపియన్​షిప్​లో బంగారు పతకం సాధించిన తొలి భారతీయుడిగా నీరజ్​ చోప్రా చరిత్ర సృష్టించాడు. తుది పోరులో నీరజ్​తో పోటీ పడ్డ భారత అథ్లెట్స్​ కిషోర్​ జెనా 84.77 మీటర్లతో 5వ స్థానంలో, డీపీ మను 84.14 మీటర్లతో 6వ స్థానంలో నిలిచారు. పాక్​ అథ్లెట్​ అర్షద్ నదీమ్ 87.82 మీటర్లు విసిరి వెండి పతకాన్ని సాధించారు. చెక్​ రిపబ్లిక్​కు చెందిన జాకబ్ వడ్లెచ్​ 86.67 మీటర్లు విసిరి కాంస్య పతకాన్ని సాధించారు. ఇదివరకే 2021 టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్​ చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించాడు.

Neeraj Chopra Wins Gold : బల్లెం వీరుడు నీరజ్​ స్వర్ణ చరిత్ర.. ప్రపంచ ఛాంపియన్‌షిప్​లో తొలి భారత అథ్లెట్​గా ఘనత

Neeraj Chopra Journey And Challenges : ఎన్నో అవమానాలు.. నీరజ్‌ లైఫ్ మలుపు తిరిగిందిలా.. బల్లెం వీరుడి కథ ఇది!

Last Updated : Aug 28, 2023, 6:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.