ETV Bharat / sports

గాయపడిన కశ్యప్.. ఆరు వారాలు ఆటకు దూరం - పారుపల్లి కశ్యప్​కు గాయం

Parupalli Kashyap Injury: షట్లర్​ పారుపల్లి కశ్యప్ ఆరు వారాల పాటు ఆటకు దూరమయ్యాడు. కాలిపిక్క భాగంలో గాయమవడమే ఇందుకు కారణం.

kashyap
కశ్యప్
author img

By

Published : Jan 7, 2022, 4:57 PM IST

Parupalli Kashyap Injury: కామన్వెల్త్ గేమ్స్ మాజీ ఛాంపియన్, షట్లర్ పారుపల్లి కశ్యప్ కాలిపిక్క గాయం కారణంగా ఆట​కు దూరమయ్యాడు. ఆరువారాల పాటు అతడు విశ్రాంతి తీసుకోవాల్సి ఉందని వైద్యులు సూచించినట్లు పేర్కొన్నాడు. విశ్రాంతి అనంతరం ట్రైనింగ్​ ప్రారంభించడంపై పునఃపరిశీలన చేయాలని తెలిపాడు.

"హైదరాబాద్ ఓపెన్​లో ఆడాను. తొలి రౌండ్​లోనే నాకు గాయమైంది. బాగా రాణిస్తున్నా అని భావించే సమయంలోనే ఇలా జరగడం బాధాకరం."

--కశ్యప్, షట్లర్.

బహుషా వయసు కారణంగా ఈ ఫిట్​నెస్​ సమస్యలు వస్తున్నాయేమోనని కశ్యప్ అనుమానం వ్యక్తం చేశాడు. ట్రైనింగ్​లో ఏం జరుగుతుందో పునఃపరిశీలన చేసుకోవాలని అన్నాడు. అయితే.. 2014 కామన్వెల్త్​లో స్వర్ణం సాధించిన తర్వాత కశ్యప్​ తరచూ ఫిట్​నెస్​ సమస్యను ఎదుర్కొంటున్నాడు.

హైదరాబాద్​లో డిసెంబర్ 24-30 మధ్య జరిగిన ఆల్​ఇండియా సీనియర్​ ర్యాంకింగ్ టోర్నమెంట్​లో కశ్యప్​కు గ్రేడ్​-1 స్థాయిలో గాయమైనట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అతడు ఆటకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఇండియా ఓపెన్ సూపర్ 500తో సహా మరో రెండు టోర్నీలకు దూరంకానున్నాడు.

ఇదీ చదవండి:

ఆల్​ఇంగ్లాండ్​ ఓపెన్​: సింధు విజయం- శ్రీకాంత్​, కశ్యప్​ ఔట్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.