పారా అథ్లెట్లు దేశానికి బలం, స్ఫూర్తి అని కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. సాధారణ క్రీడాకారులతో పాటు వారిని ప్రభుత్వం సమానంగా చూస్తోందని స్పష్టం చేశారు. 29వ ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా వర్చువల్ ఈవెంట్లో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు దీపా మాలిక్, దేవేంద్ర జజారియా, పారుల్ పార్మర్, శతాబ్ది అశ్వతి తదితరులు పాల్గొన్నారు.
-
I'm delighted to interact with Indian Para-Athletes at an exclusive online event. Under the leadership of PM @narendramodi Ji, accessible India initiative have been taken up to ensures full support to our Divyang sisters and brothers. #InternationalDayofPersonswithDisabilities pic.twitter.com/ZhRvxzSMDu
— Kiren Rijiju (@KirenRijiju) December 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">I'm delighted to interact with Indian Para-Athletes at an exclusive online event. Under the leadership of PM @narendramodi Ji, accessible India initiative have been taken up to ensures full support to our Divyang sisters and brothers. #InternationalDayofPersonswithDisabilities pic.twitter.com/ZhRvxzSMDu
— Kiren Rijiju (@KirenRijiju) December 3, 2020I'm delighted to interact with Indian Para-Athletes at an exclusive online event. Under the leadership of PM @narendramodi Ji, accessible India initiative have been taken up to ensures full support to our Divyang sisters and brothers. #InternationalDayofPersonswithDisabilities pic.twitter.com/ZhRvxzSMDu
— Kiren Rijiju (@KirenRijiju) December 3, 2020
"మా పారా అథ్లెట్లు, 'దివ్యాంగ్' వారియర్స్ మా బలం. వారే మాకు స్ఫూర్తినిచ్చారు. క్రీడా మంత్రిత్వశాఖ.. మిగతా క్రీడాకారులతో పాటే వారిని సమానంగా చూస్తోంది. గుర్తింపు, ప్రైజ్మనీ విషయంలో వారిని అదే రీతిలో గౌరవిస్తున్నాం. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు.. ఆయా రాష్ట్రాల్లోని పారా అథ్లెట్లకు పూర్తి సహకారం అందించాలని కోరుతున్నాను"
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా మంత్రి
పారా అథ్లెట్లకు పూర్తి సహకారమందిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి అర్జున అవార్డు గ్రహీత దేవేంద్ర జజారియా ధన్యవాదాలు చెప్పాడు. ఏదైనా సమస్యను ప్రభుత్వానికి మెయిల్ చేస్తే గంటలో అది పరిష్కారమవుతుందని తెలిపాడు.