పారా అథ్లెట్, పారాలింపిక్ పతక విజేత దీపా మాలిక్.. 'పారాలింపిక్ కమిటీ ఆఫ్ ఇండియా' అధ్యక్షురాలిగా ఎంపికైంది. ఈ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో తాజాగా విజయం సాధించిందీ స్టార్ ప్లేయర్. త్వరలో బాధ్యతలు చేపట్టనుంది. 2016లో జరిగిన సమ్మర్ పారాలింపిక్స్‌లో షాట్‌పుట్ విభాగంలో దీప రజతం సాధించింది. ఈ క్రీడల్లో పతకం గెలిచిన తొలి మహిళగా గుర్తింపు పొందింది.
2018లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ డిస్కస్ త్రో, జావలిన్ త్రో పోటీల్లో కాంస్యం గెల్చుకుంది. 2019లో ప్రఖ్యాత 'రాజీవ్ గాంధీ ఖేల్‌రత్న' పురస్కారం అందుకుంది. వెన్నెముక గాయం కారణంగా ఈ ఏడాది ఒలింపిక్స్‌లో పోటీ చేయట్లేదీ పారా అథ్లెట్.
-
(1/2) My heartiest congratulations on the commencement of new innings of a fresh tenure in @ParalympicIndia. Expressing my gratitude on being trusted with the Presidentship and welcoming an athlete centric approach in para sports in India. https://t.co/oqIj2EM7Lk
— Deepa Malik (@DeepaAthlete) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">(1/2) My heartiest congratulations on the commencement of new innings of a fresh tenure in @ParalympicIndia. Expressing my gratitude on being trusted with the Presidentship and welcoming an athlete centric approach in para sports in India. https://t.co/oqIj2EM7Lk
— Deepa Malik (@DeepaAthlete) February 1, 2020(1/2) My heartiest congratulations on the commencement of new innings of a fresh tenure in @ParalympicIndia. Expressing my gratitude on being trusted with the Presidentship and welcoming an athlete centric approach in para sports in India. https://t.co/oqIj2EM7Lk
— Deepa Malik (@DeepaAthlete) February 1, 2020
స్ఫూర్తిదాయకం...
దీపా మాలిక్... భారతదేశం గర్వించదగ్గ పారా అథ్లెట్లలో ఒకరు. స్విమ్మింగ్, జావలిన్ త్రో, షాట్‌పుట్, క్రికెట్, డిస్కస్ త్రో వంటి పలు రంగాల్లో ప్రావీణ్యం ఆమె సొంతం. వివిధ క్రీడల్లో జాతీయ స్థాయిలో 54, అంతర్జాతీయ వేదికలపై 13 బంగారు పతకాలు సాధించింది. నాలుగుసార్లు లిమ్కా బుక్ రికార్డుల్లో పేరు లిఖించుకొంది. అందుకే ఈ క్రీడాకారిణి ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం 'అర్జున' అవార్డుతో సత్కరించింది.

సాహసే మంత్రం..
హరియాణాలోని భైస్వాల్‌లో జన్మించింది దీపా మాలిక్. చిన్ననాటి నుంచే ఆమెకు సాహోసోపేత క్రీడలంటే ఇష్టం. 1999లో వెన్నెముకలో చిన్న గడ్డ ఏర్పడటం వల్ల ఆసుపత్రి పాలైంది. ఫలితంగా వెనుకభాగంలో మూడు సర్జరీలు చేసి 183 కుట్లు వేశారు. అప్పట్నుంచి వీల్‌చైర్‌కే పరిమితమైనా... విభిన్న క్రీడా రంగాల్లో సత్తా చాటుతూ భారత్‌లో ఉత్తమ పారా అథ్లెట్లలో ఒకరిగా నిలిచింది. యమునా నదిని ఈదడం, ప్రత్యేక మోటార్ బైక్‌లో చెన్నై నుంచి దిల్లీ వరకు 3 వేల కిలోమీటర్ల ప్రయాణం, హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో 8 రోజుల ప్రయాణం ఈమె సాహసాల్లో ప్రధానమైనవి.