ETV Bharat / sports

Olympics: ఒలింపిక్స్​ కోసం భారత్​ బిడ్డింగ్​! - 2036 ఒలింపిక్స్​

Olympics India Host: 2036 ఒలింపిక్స్​ను భారత్​లో నిర్వహించేందుకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు భారత​ ఒలింపిక్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నరీందర్​ బాత్రా. అంతర్జాతీయ ఒలింపిక్స్​ సెషన్​ నిర్వహించేందుకు భారత్​కు అవకాశం రావడం ఇందుకు ముందడుగని పేర్కొన్నారు.

olympics
ఒలింపిక్స్
author img

By

Published : Feb 19, 2022, 10:48 PM IST

Olympics India Host: వచ్చే ఏడాది అంతర్జాతీయ ఒలింపిక్స్​ సెషన్​ నిర్వహించేందుకు భారత్​ హక్కులు దక్కించుకున్న నేపథ్యంలో ఇండియాలో ఒలింపిక్స్​ నిర్వహణకు ముందడుగు పడినట్లు అయింది. దీనిపై ఇండియన్​ ఒలింపిక్స్​ అసోసియేషన్​ హర్షం వ్యక్తం చేసింది. 2036 ఒలింపిక్స్​ లక్ష్యంగా భారత్​ కృషి చేస్తున్నట్లు అధ్యక్షుడు నరీందర్​ ధ్రవ్​ బాత్రా వెల్లడించారు.

"ఒలింపిక్స్​ సెషన్​ నిర్వహించేందుకు అవకాశం రావడం గర్వకారణం. భారత్​లో ఒలింపిక్స్​కు ఇది మంచి పరిణామం. దేశంలో 2030లో యూత్​ ఒలింపిక్స్​, 2036లో ఒలింపిక్స్​ను నిర్వహించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నాము. మరి కొన్నేళ్లలో భారత్​ ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. కాబట్టి మౌలిక వసతులకు సంబంధించి కూడా భారీగా అభివృద్ధి జరుగుతుంది. భవిష్యత్తులో భారత్​ క్రీడలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని భావిస్తున్నాను."

-డాక్టర్​ నరీందర్​ ధ్రువ్​ బాత్రా, ఐఓఏ అధ్యక్షుడు

భారత్​లో అంతర్జాతీయ ఒలింపిక్స్​ సెషన్​ను తొలిసారిగా 1983లో నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ 40 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి నిర్వహించేందుకు భారత్​కు అవకాశం దక్కింది. ముంబయి వేదికగా వచ్చే ఏడాది ఈ కార్యక్రమం జరగనుంది.

ఇదీ చూడండి: టీమ్​ఇండియా టెస్టు కెప్టెన్​గా రోహిత్​ శర్మ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.