ETV Bharat / sports

అథ్లెట్లకు రీసైక్లింగ్ 'బెడ్'.. ఈసారి అది కుదరదు!

author img

By

Published : Jul 18, 2021, 2:11 PM IST

టోక్యో ఒలింపిక్స్​కు కొద్దిరోజులే ఉంది. ఈ క్రమంలో సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చారు టోర్నీ నిర్వాహకులు. శృంగారానికి వీలులేని విధంగా మంచాల్ని తయారు చేశారు. ఇంతకీ ఈ బెడ్ సంగతేంటి?

'Anti-sex' beds at Games village
ఒలింపిక్స్

మిగతా ఒలింపిక్స్​కు, ఈ ఒలింపిక్స్​కు చాలా తేడా ఉంది. కరోనా వల్ల ప్రణాళికల్లో చాలావరకు మార్పులు జరిగాయి. కానీ ఈసారి మాత్రం ఓ విషయం చాలా ఆసక్తి కలిగిస్తోంది.

ఒలింపిక్స్​ కోసం ప్రపంచ దేశాల నుంచి వచ్చే క్రీడాకారులు బస చేసేందుకు 'ఒలింపిక్ విలేజ్'ను(ఒలింపిక్ గ్రామం) నిర్మిస్తుంది ఆతిథ్య దేశం. ఈసారి కూడా టోక్యోలో అలానే నిర్మించారు. కరోనా ప్రభావంతో ఏడాదిపాటు క్రీడలు వాయిదా పడటం వల్ల ఫర్నీచర్​లో చాలా వరకు మార్పులు చేశారు. అంతకుముందు 200 కిలోల బరువుతో ఉన్న బెడ్లను ఏర్పాటు చేయగా, ఇప్పుడు రీసైక్లింగ్​కు వీలుండే, తేలికైన బెడ్​లను అథ్లెట్ల కోసం అందుబాటులో ఉంచారు. వీటిని 'యాంటీ సెక్స్ బెడ్'గా అని పిలుస్తున్నారు.

.
.

శృంగారానికి వీల్లేకుండానే..!

రీసైక్లింగ్​ చేసిన పదార్థాలతో తయారుచేసిన ఈ మంచంపై కేవలం ఒక్క అథ్లెట్​ మాత్రమే నిద్రపోవడానికి వీలుంటుంది. మరొకరు చేరితే అది విరిగిపోతుంది! దీని వల్ల ఆటగాళ్లు.. శృంగారం, ఇతరత్రా అంశాలు చేయడానికి వీలుపడదు. అలానే క్రీడలు ముగిసిన తర్వాత ఈ మంచాల్ని రీసైక్లింగ్ చేసి పేపర్ ఉత్పత్తుల్ని, దుప్పట్లతో ప్లాస్టిక్​ ఉత్పత్తుల్ని తయారు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.

కండోమ్​లు ఇచ్చేది అప్పుడే

అలానే క్రీడాకారుల కోసం దాదాపు లక్షా 60 వేల కండోమ్​ల అందుబాటులో ఉంచారు. అయితే వీటిని పోటీలు పూర్తయి, ఒలింపిక్ విలేజ్​ నుంచి బయటకు వచ్చిన తర్వాత అథ్లెట్లకు అందజేయనున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు. ఆ కండోమ్​లతో తమ తమ దేశాల్లో హెచ్​ఐవీ, ఎయిడ్స్​ వ్యాధులపై అవగాహన కల్పించాలని ప్లేయర్లకు సూచించారు.

అతిక్రమిస్తే బహిష్కరణే..

ఒలింపిక్స్​లో పాల్గొనే క్రీడాకారులు.. కరోనా నిబంధనలు అత్రికమించినా, భౌతిక దూరం పాటించకపోయినా వారిపై అనర్హత వేటు వేయడం, బహిష్కరించడం చేస్తామని అంతర్జాతీయ ఒలింపిక్​ కమిటీ ఇప్పటికే హెచ్చరించింది.

'Anti-sex' beds at Games village
ఒలింపిక్​ ప్లేయర్​

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.