దేశంలోని క్రీడాకారుల సౌకర్యార్థం సెంట్రల్ అథ్లెట్ ఇంజూరీ మేనేజ్మెంట్ సిస్టమ్(సీఏఐఎంఎస్)ను.. కేంద్ర యువజన వ్యవహారాల, క్రీడా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. అథ్లెట్లకు ప్రపంచ స్థాయి పునరావాసం కల్పించడమే కాకుండా క్రీడాకారులకు ఔషధ సదుపాయాల కోసం దీన్ని ఏర్పాటు చేశారు. ఎస్కేఎస్ మార్య, దిన్షా పర్దివాలా, బీవీ శ్రీనివాస్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నిపుణలు ఇందులో సభ్యులుగా ఉన్నారు.
గాయపడిన అథ్లెట్లను భౌగోళికంగా దగ్గర్లో ఉన్న కేంద్రానికి పంపించడం సీఏఐఎంఎస్ ముఖ్య లక్ష్యం. దేశవ్యాప్తంగా క్రీడాకారులకు తగిన చికిత్స అందించేందుకు ఈ విధానం సహాయపడనుంది. టార్గెట్ ఒలింపిక్ పోడియమ్ స్కీమ్‌లో భాగమైన అథ్లెట్లకు మద్దతు ప్రకటించడం కోసం ఈ సీఏఐఎంఎస్ను ప్రారంభించారు.
"సెంట్రల్ అథ్లెట్ ఇంజూరీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏర్పాటు అనేది చిరకాల కోరిక. చిన్నచిన్న గాయాలకు కూడా సరైన సమయంలో చికిత్స అందకపోవడం వల్ల అథ్లెట్లు తమ క్రీడా జీవితాన్ని కోల్పోవడం చూశాను. ఈ రోజు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం గౌరవనీయం. ఇది ప్రతి క్రీడాకారుడికి ఉపయోగకరంగా ఉంటుంది."
-కిరణ్ రిజిజు, కేంద్ర క్రీడా శాఖ మంత్రి.
ఇదీ చదవండి: WTC Final: టీమ్ఇండియా ప్రాక్టీస్ ముమ్మరం