ETV Bharat / sports

భారత షూటర్ కారు చోరీ.. పట్టించుకోని పోలీసులు

ఓ వివాహానికి హాజరైన సమయంలో తన కారును ఎవరో దొంగిలించారని అన్నాడు షూటర్ దీపక్ కుమార్. అయితే ఈ విషయంలో పోలీసులు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పాడు.

భారత షూటర్ కారు చోరీ.. పట్టించుకోని పోలీసులు
భారత షూటర్ దీపక్ కుమార్
author img

By

Published : Feb 19, 2020, 8:40 PM IST

Updated : Mar 1, 2020, 9:25 PM IST

భారత షూటర్, టోక్యో ఒలింపిక్స్​లో పాల్గొనున్న దీపక్​ కుమార్ కారును దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. దిల్లీలో సోమవారం రాత్రి, అతడు బంధువుల వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ ఘటన జరిగింది. ఇంతకు ముందు 2018లోనూ దీపక్​ కారులో ఉంచిన ఖరీదైన వస్తువుల్ని ఇలానే దొంగిలించారు.

SHOOTER DEEPAK KUMAR
భారత షూటర్ దీపక్ కుమార్

తన కారు కనిపించకపోయిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశానని, కానీ వారు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు దీపక్ కుమార్. ఒలింపిక్స్ గేమ్స్​ ముందున్న దృష్ట్యా ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించట్లేదని అన్నాడు. మెగాటోర్నీలో 10 మీటర్ల ఎయిర్​ రైఫిల్​ విభాగంలో పోటీపడనున్నాడీ షూటర్.

'దిల్లీలో త్వరలో జరిగే షూటింగ్ ప్రపంచకప్​లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిచేందుకు ప్రయత్నిస్తాను. అయితే కారు దొంగతనం లాంటి విషయాలు నా ఏకాగ్రతను దెబ్బతీయలేవు. నాకే ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు?' -దీపక్ కుమార్, భారత షూటర్

Last Updated : Mar 1, 2020, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.