ETV Bharat / sports

ఒలింపిక్స్ ఇంతకీ జరుగుతాయా? లేదా?

author img

By

Published : Mar 16, 2020, 8:07 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్​ విస్తరిస్తున్న తరుణంలో అనేక టోర్నీలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో నాలుగేళ్లకు ఒకసారి వచ్చే విశ్వక్రీడలకు అంతరాయం కలగనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

Olympic organizers and athletes who will be severely affected by the corona virus
విశ్వక్రీడల నిర్వహణకు కరోనా కష్టాలు

ఆ ఈవెంట్‌ రద్దు.. ఈ పోటీలు వాయిదా! ఇలా కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా ఇవే వార్తలు. కరోనా వైరస్‌ ప్రభావం ఆటలపై తీవ్ర స్థాయిలోనే ఉంది. క్రికెట్లో ఓ ద్వైపాక్షిక సిరీస్‌ వాయిదా పడితే.. టెన్నిస్‌లో ఓ ఏటీపీ టోర్నీ రద్దయితే పోయేదేం లేదు. నష్టం కొంతే!

కానీ నాలుగేళ్లకోసారి జరిగే అత్యంత ప్రతిష్టాత్మక క్రీడా సంబరం ఒలింపిక్స్‌ రద్దయితే? లేదా వాయిదా పడితే?.. మొత్తం క్రీడా ప్రపంచం అతలాకుతలం అయిపోవడం ఖాయం. నిర్వాహకులు, క్రీడాకారులకు ఈ ఊహ కూడా భయోత్పాతాన్ని కలిగించేదే! అయినా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే టోక్యోలో జరగాల్సిన ఈ మెగా టోర్నీలో మార్పులు చేర్పులు తప్పేలా కనిపించడం లేదు.

ససేమిరా అంటున్నా

టోక్యో ఒలింపిక్స్‌కు ఇంకో 130 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈపాటికి వివిధ క్రీడల్లో జోరుగా అర్హత టోర్నీలు జరుగుతుండాలి. ఆతిథ్య దేశంలో సన్నాహాలు జోరందుకోవాలి. టెస్ట్‌ ఈవెంట్లు నిర్వహిస్తుండాలి. కానీ అన్ని చోట్లా వ్యవస్థలు స్తంభించిపోయాయి. అన్ని టోర్నీలూ రద్దయిపోయాయి. దీనికంతటికీ కారణం ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా. ఈ మహమ్మారి రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తుండటం వల్ల మనుషుల ప్రాణాలకు మించి ఏదీ ముఖ్యం కాదన్న ఉద్దేశంతో ఆటలకూ చెక్‌ పెట్టేస్తున్నాయి ప్రపంచ దేశాలు.

మిగతా టోర్నీలు ఏమైనా పర్వాలేదు కానీ.. దాదాపు రూ.9 లక్షల కోట్ల బడ్జెట్‌తో నిర్వహించే ఒలింపిక్స్‌ను రద్దు చేయడం లేదా వాయిదా వేయడమంటే మాటలు కాదు. కరోనా ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఒలింపిక్స్‌ తేదీల్లో మార్పు ఉండదని, యధావిధిగా జులై 24న ఆరంభమవుతాయని ఐఓసీ స్పష్టం చేస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో తీవ్రత పెరిగితే మార్పులు చేర్పులు అనివార్యం కావచ్చు. ఇందుకోసం ఐఓసీ ప్లాన్‌-బి సిద్ధం చేసుకోక తప్పదు.

అదే అసలు సమస్య

ఒలింపిక్స్‌ను నెలో రెండు నెలలో అయినా వాయిదా వేయక తప్పని పరిస్థితి కనిపిస్తుండటానికి ముఖ్య కారణం.. ఈ మెగా టోర్నీ సన్నాహకాలన్నీ ఆగిపోవడమే. ఒలింపిక్స్‌కు ముందు నాలుగైదు నెలల కాలం అథ్లెట్లకు చాలా కీలకం. ఈ కాలంలో వివిధ క్రీడల్లో ఒలింపిక్‌ అర్హత టోర్నీలు చాలానే జరుగుతాయి. వందల మంది అథ్లెట్లు టోక్యో బెర్తుల కోసం పోటీల్లో పాల్గొంటుంటారు. ప్రస్తుతం బాక్సింగ్‌, బ్యాడ్మింటన్‌ సహా ఒలింపిక్స్‌ అర్హతను నిర్దేశించే ఎన్నో టోర్నీలు ఆగిపోయాయి.

వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియట్లేదు. వీటి సంగతి తేలకుండా ఒలింపిక్స్‌ నిర్వహణ సాధ్యం కాదు. అర్హత టోర్నీల విషయానికి వస్తే.. ఈ సమయంలో విదేశాలకు వెళ్లి సాధన చేయాల్సిన క్రీడాకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అత్యంత కీలక సమయంలో సాధన ఆగిపోవడం ఒలింపిక్స్‌ సన్నాహాలకు గట్టి దెబ్బే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వెనక్కి జరపాలన్న డిమాండ్‌ క్రీడాకారుల నుంచే వస్తోంది.

అత్యుత్తమ మార్గమిదే

ఒలింపిక్స్‌ నిర్వహణలో అతి పెద్ద సమస్యగా పరిణమిస్తున్నది ఆతిథ్య జపానే. అక్కడ కరోనా ప్రభావం తక్కువగా ఏమీ లేదు. చైనా నుంచి రాకపోకలు ఎక్కువగా ఉండటం వల్ల జపాన్‌ చాలా ముందే కరోనా బారిన పడింది. అక్కడ దాదాపు 1000 మంది కరోనాతో బాధపడుతున్నారు. దేశంలో అనేక క్రీడా ఈవెంట్లు, కార్యకలాపాలు ఆగిపోయాయి. ఒలింపిక్స్‌ టెస్ట్‌ ఈవెంట్లు రద్దయ్యాయి. కరోనా ప్రభావం మరింత తీవ్రమయ్యేలా కనిపిస్తున్న దేశంలో ఒలింపిక్స్‌ నిర్వహణ అంత తేలిక కాదు.

ఒలింపిక్స్‌ కోసం లక్షల మంది జపాన్‌కు వస్తారు. స్టేడియాలకు వెళ్తారు. దీంతో కరోనా విస్తరిస్తుందనే భయం ఉంది. దీన్ని నివారించాలంటే ఇప్పుడు కొన్ని క్రీడా ఈవెంట్లు నిర్వహిస్తున్నట్లు ఖాళీ స్టేడియాల్లో పోటీలు జరిపించాలి. స్టేడియాలకు ప్రేక్షకుల్ని అనుమతించకూడదు. ఇప్పుడు ఐఓసీ ముందున్న అత్యుత్తమ మార్గం ఇదే అంటున్నారు. కొంచెం ఆలస్యంగా అయినా అర్హత టోర్నీలన్నీ పూర్తి చేసి.. యధావిధిగా జులై 24 నుంచి ఖాళీ స్టేడియాల్లో ఒలింపిక్స్‌ నిర్వహిస్తే పెద్ద ఇబ్బంది ఉండదన్నది విశ్లేషకుల మాట.

రద్దయితే?

కరోనా కారణంగా విపత్కర పరిస్థితులు తలెత్తి ఒలింపిక్స్‌ రద్దయితే ఏంటి పరిస్థితి అన్నది ఇప్పుడు క్రీడా ప్రపంచాన్ని తొలిచేస్తున్న ప్రశ్న. ఈ మెగా టోర్నీ కోసం ఏళ్లకు ఏళ్లు క్రీడాకారులు ఎలా సన్నద్ధమవుతారో.. దేశాలకు దేశాలు ఎలా సన్నాహాలు చేస్తాయో, ఎంత ఖర్చు చేస్తాయో తెలిసిందే. ఆ శ్రమ, ఖర్చు అంతా వృథా అయిపోతాయి. ఒలింపిక్స్‌లో పాల్గొనే జీవిత కాల అవకాశం చేజారితే క్రీడాకారుల మానసిక స్థితి ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం.

ఆతిథ్య దేశంతో ఒప్పందం ప్రకారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ)కి ఒలింపిక్స్‌ను రద్దు చేసే, లేదా వేదికను మార్చే అధికారం ఉంటుంది. అటు ఐఓసీ, ఇటు ఆతిథ్య దేశంతో పాటు స్పాన్సర్లు ఒలింపిక్స్‌ కోసం వేర్వేరుగా బీమాలు చేస్తారు. బీమా చెల్లింపులు జరిగినా నష్టం భారీగానే ఉంటుంది. టోర్నీ నిజంగా రద్దయితే ఈ చెల్లింపులు చేసే బీమా సంస్థలు మునిగిపోవడం ఖాయం.

వాయిదా వేస్తే

ఒలింపిక్స్‌ను నెలా లేదా రెండు నెలలు వాయిదా వేస్తే ఎలాగోలా సర్దుకోవచ్చు. అంతకుమించి అంటే అంత సులువు కాదు. మొత్తం క్రీడా క్యాలెండర్‌ అంతా మార్చుకోవాల్సి ఉంటుంది. పదుల సంఖ్యలో క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి కాబట్టి ఆయా క్రీడలకు సంబంధించి తర్వాత జరగాల్సిన టోర్నీలన్నీ మార్చాల్సి ఉంటుంది. అదంత తేలిక కాదు. ఒలింపిక్స్‌ ప్రసార హక్కులు దక్కించుకున్న సంస్థ ఇందుకు ఒప్పుకునే అవకాశమే లేదు.

టోక్యో ఒలింపిక్స్‌ ప్రసారదారు ఎన్‌బీసీ ఈ టోర్నీకి సంబంధించి ఇప్పటికే రూ.88 వేల కోట్ల మేర ప్రకటనలు అమ్మేసింది. టోర్నీ వెనక్కి వెళ్తే ఈ ఒప్పందాలతో ఇబ్బందే. ఈ ఏడాది చివరి క్వార్టర్లో యుఎస్‌ బాస్కెట్‌బాల్‌ సహా అనేక పెద్ద క్రీడా ఈవెంట్లున్నాయి. ఒలింపిక్స్‌ను ఏడాది చివరికి వాయిదా వేస్తే వాటికి అడ్డం పడుతుంది. కాబట్టి రెండు నెలలకు మించి వాయిదా అంటే తీవ్ర ఇబ్బందికరమే.

ఇదీ చూడండి.. కరోనా ఎఫెక్ట్​: నో యాక్షన్​.. ఓన్లీ పేకప్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.