ETV Bharat / sports

ప్రపంచ, ఒలింపిక్​ ఛాంపియన్​.. 32 ఏళ్ల మహిళా అథ్లెట్​ మృతి

author img

By

Published : May 4, 2023, 11:11 AM IST

Updated : May 4, 2023, 11:20 AM IST

32ఏళ్ల ఒలింపిక్‌ ఛాంపియన్‌ మహిళా ట్రాక్​ అండ్ ఫీల్డ్​ అథ్లెట్‌ టోరి బోవి హఠాన్మరణం చెందింది. ఆమె మృతికి గల కారణాలు తెలియలేదు.

Olympic medal winning sprinter Tori Bowie dies aged 32
ప్రపంచ, ఒలింపిక్​ ఛాంపియన్​.. 32 ఏళ్ల మహిళా అథ్లెట్​ మృతి

ప్రపంచ, ఒలింపిక్‌ ఛాంపియన్‌ మహిళా ట్రాక్​ అండ్ ఫీల్డ్​ అథ్లెట్‌ టోరి బోవి అకస్మాతుగా కన్నుమూసింది. 32 ఏళ్ల ఆమె.. అమెరికా ఫ్లోరిడాలోని తన నివాసంలో విగతజీవిగా పడి ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఆమె మరణానికి గల కారణాలను ఇంకా తెలియలేదు. ఈ విషయాన్ని టోరి మేనేజ్​మెంట్ కంపెనీ కూడా ధ్రువీకరించింది. "టోరీ బోయి ఇకలేదన్న వార్తను మీకు తెలియజేయడం చాలా బాధగా ఉంది. మేము మంచి ఫ్రెండ్​, డాటర్​, సిస్టర్ లాంటి ​అథ్లెట్​ను కోల్పోయాం" అని మేనేజ్​మెంట్​ ట్వీట్ చేసింది. అయితే కొంత కాలంగా టోరీ మానసిక ఒత్తిడితో బాధపడుతోందని తెలిసింది. ఆమె మృతి పట్ల అక్కడి పలువురు క్రీడాకారులు సంతాపం తెలుపుతున్నారు.

"మూడు సార్లు ఒలింపిక్​ విజేత, రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్​ అయిన టోరి బోవి కన్నుమూయడం చాలా బాధకారమైన విషయం. ఈ విషయాన్ని షేర్​ చేయడం ఎంతో బాధగా ఉంది. ఎంతో టాలెంట్ ఉన్న అథ్లెట్​. క్రీడల్లో ఆమె అందించిన సేవలు మరవలేనివి. ఎంతో ప్రభావితం చేసింది. ఆమెను మిస్​ అవుతున్నాం" అని యూఎస్​ఏటీఎఫ్​ ఫెడరేషన్​ సీఈఓ మ్యాక్స్​ సీగల్​ సంతాపం వ్యక్తం చేశారు.

Olympic medal winning sprinter Tori Bowie dies aged 32
టోరి బోవి మృతి

కెరీర్​ విజయాలు.. 2013లో తన కెరీర్​ను ప్రారంభించింది టోరి బోవి. 2015 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లలో బ్రాంజ్ మెడల్ సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో 4x100 మీటర్ల రిలేలో గోల్డ్​ మెడల్​, 100 మీటర్లలో సిల్వర్ మెడల్​, 200 మీటర్లలో బ్రాంజ్ మెడల్​ను ముద్దాడింది. 2017లో లండన్​లో జరిగిన ఐఏఏఎఫ్​ ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్​లోనూ 100 మీటర్ల విభాగంలో విజేతగా నిలిచి స్వర్ణాన్ని అందుకుంది. అలానే అమెరికా తరఫున 4x100 మీటర్ల రిలే విభాగంలో గోల్డ్ మెడల్​ను తన ఖాతాలో వేసుకుంది. 2011 నుంచి అథ్లెట్​ కార్​మెలిటా జెటెర్​ తర్వాత ఒలింపిక్​, వరల్డ్ 100 మీటర్ల టైటిల్ గెలిచిన రెండో అమెరికన్​ మహిళ టోరీనే కావడం విశేషం.

లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానం.. డైమండ్‌ లీగ్‌ మీట్‌లో నాలుగుసార్లు 100 మీటర్లలో, నాలుగుసార్లు 200 మీటర్లలో గోల్డ్​ మెడల్స్​ను ముద్దాడింది టోరి. 2019లో దోహా వేదికగా జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్​గా బరిలోకి దిగి.. 100 మీటర్ల విభాగంలో సెమీఫైనల్‌కు చేరింది. కానీ ఆమె సెమీఫైనల్​ రేసులో పోటీపడలేదు. ఈ మెగా ఈవెంట్‌లో ఆమె లాంగ్‌జంప్‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత మళ్లీ మరో అంతర్జాతీయ ఈవెంట్‌లో పోటీపడలేదు.

ఇదీ చూడండి: రెజ్లర్లు-పోలీసుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ.. గాయపడిన బజరంగ్​, వినేశ్ ఫొగాట్​

Last Updated : May 4, 2023, 11:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.