Hockey Player Varinder Singh Died: ఒలింపిక్ పతక విజేత, భారత మాజీ హాకీ ప్లేయర్ వరీందర్ సింగ్(75) తుదిశ్వాస విడిచారు. 1970లలో భారత్ సాధించిన అనేక చిరస్మరణీయ విజయాలలో ఆయన భాగస్వామ్యం ఉంది. తన స్వగ్రామమైన పంజాబ్‌లోని జలంధర్‌లో మంగళవారం కన్నుమూశారు వరీందర్. ఆయన అంత్యక్రియలు ఈ సాయంత్రం జలంధర్‌లోని శంషాన్ ఘాట్‌లో జరగనున్నాయి.
1947 మే 16న జన్మించిన వరిందర్ సింగ్.. 1975లో కౌలాలంపుర్‌లో జరిగిన 1975 పురుషుల హాకీ ప్రపంచ కప్‌లో బంగారు పతకం సాధించిన భారత జట్టులో సభ్యుడు. ఆ టోర్నమెంట్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 2-1 తేడాతో ఓడించింది భారత్. 1972 సమ్మర్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించారు వరీందర్. 1973లో ఆమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన ప్రపంచకప్‌లో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 2007లో వరిందర్కు ధ్యాన్‌చంద్ జీవిత సాఫల్య పురస్కారం లభించింది. సింగ్ మృతి పట్ల హాకీ సహా పలువురు క్రీడాకారులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: మూడున్నర దశాబ్దాల్లో తొలిసారి.. కపిల్ దేవ్ తర్వాత బుమ్రానే!
తెలుపు దుస్తులు.. 23 టన్నుల స్ట్రాబెర్రీలు.. వింబుల్డన్ క్రేజీ విశేషాలివే..!