ETV Bharat / sports

రెజ్లింగ్ నుంచి 'అర్జున'కు సిఫార్సు చేసింది వీరినే - సరిత మోర్

దేశంలోని అత్యున్నత క్రీడా పురస్కారాలకు ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేశాయి వివిధ క్రీడా సంస్థలు. ఇందులో రెజ్లింగ్​ నుంచి రవి దాహియా, దీపక్ పూనియా, అన్షు మాలిక్ పేర్లను అర్జున అవార్డుకు నామినేట్​ చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య.

ravi dahiya, deepak punia
రవి దాహియా, దీపక్ పూనియా
author img

By

Published : Jun 30, 2021, 10:36 PM IST

ఆగస్టు 29న హాకీ దిగ్గజం ధ్యాన్​చంద్​ పుట్టినరోజు పురస్కరించుకుని వివిధ క్రీడా విభాగాల్లో ఆటగాళ్లకు ఇవ్వనున్న ఖేల్​రత్న, అర్జున, ద్రోణాచార్య(కోచ్​లకు) అవార్డుల కోసం ఆటగాళ్ల పేర్లను నామినేట్ చేశాయి క్రీడా సంస్థలు.

రెజ్లింగ్..

రెజ్లింగ్​ నుంచి ప్రపంచ ఛాంపియన్​షిప్​ పతక విజేత, రెజ్లర్​ రవి దాహియా, దీపక్ పూనియా, అన్షు మాలిక్​, సరిత మోర్​ను అర్జున అవార్డుకు నామినేట్ చేసింది భారత రెజ్లింగ్ సమాఖ్య.

కోచ్​లు విక్రమ్​, కుల్దీప్​ మాలిక్, సుజీత్​ మాన్​.. ద్రోణాచార్య అవార్డుకు నామినేట్​ చేసింది డబ్ల్యూఎఫ్​ఐ. ఇందులో కుల్దీప్​ మాలిక్​కు గతంలోనే ద్రోణాచార్య అవార్డు వరిచింది. దీంతో ఆమె దరఖాస్తును పరిగణలోకి తీసుకోకపోవచ్చు.

లైఫ్​ టైమ్​ అచీవ్​మెంట్ కేటగిరీ (ద్రోణాచార్య)లో జాగ్రూప్​ రాథి, ఆర్కే హుడా, ఆర్ఎస్ కుంద్​ పేర్లను నామినేట్ చేసింది డబ్ల్యూఎఫ్​ఐ.

రైఫిల్స్ విభాగం నుంచి..

డబుల్​ ట్రాప్ ప్రపంచ ఛాంపియన్​ అంకూర్​ మిట్టల్​, షూటర్​ అంజుమ్​ మొద్గిల్​ పేర్లను ఖేల్​రత్న అవార్డుకు నామినేట్​ చేసింది నేషనల్​ రైఫిల్స్​ అసోసియేషన్​ ఆఫ్ ఇండియా. అర్జున అవార్డు కోసం ఎలావెనిల్ వలరివన్​, అభిషేక్​ వర్మ, ప్రకాశ్ మిథేర్వల్ పేర్లను సూచించింది. ద్రోణాచార్య అవార్డు కోసం ఏ ఒక్కరి పేరును సిఫార్సు చేయలేదు.

టేబుల్ టెన్నిస్ నుంచి..

ఇక టేబుల్​ టెన్నిస్ విభాగం నుంచి శరత్ కమల్​ పేరును ఖేల్​రత్న అవార్డుకు నామినేట్ చేశారు సంబంధిత అధికారులు. ఒలింపిక్స్​కు అర్హత సాధించిన సుతిర్థ ముఖర్జీ, అహికా ముఖర్జీ, మనవ్ టక్కర్​ పేర్లను అర్జున అవార్డుకు నామినేట్​ చేశారు.

ఇదీ చదవండి: ఖేల్​రత్న పురస్కారం కోసం అశ్విన్, మిథాలీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.