ETV Bharat / sports

'టాప్స్​' బృందంలో స్ప్రింటర్​ ద్యుతి చంద్​కు చోటు

author img

By

Published : Nov 30, 2020, 7:32 AM IST

టోక్యో ఒలింపిక్స్​ లక్ష్యంగా టార్గెట్​ ఒలింపిక్​ పోడియం స్కీమ్​ (టాప్స్​) పథకాన్ని క్రీడా మంత్రిత్వశాఖ ప్రారంభించింది. ఇందులో స్ప్రింటర్​ ద్యుతి చంద్​ చోటు దక్కించుకుంది. ఆమెతో పాటు రేస్​ వాకర్​ ఇర్ఫాన్​, శివపాల్​ సింగ్​ (జావెలిన్​ త్రో) కూడా ఈ బృందంలో ఉన్నారు.

Olympic-bound race walker KT Irfan, sprinter Dutee Chand included in TOPS core group
'టాప్స్​' బృందంలో స్ప్రింటర్​ ద్యుతి చంద్​కు చోటు

టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ (టాప్స్‌) పథకం ముఖ్య బృందంలో స్ప్రింటర్‌ ద్యుతి చంద్‌ చోటు సంపాదించింది. ఆమెతో పాటు రేస్‌ వాకర్‌ ఇర్ఫాన్‌, జావెలిన్‌ త్రో ఆటగాడు శివపాల్‌ సింగ్‌ కూడా ఈ గ్రూపులో ఉన్నారు.

ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రాతో పాటు స్టార్‌ అథ్లెట్‌ హిమ దాస్‌, అన్నురాణి (జావెలి త్రో), అరోకియా రాజీవ్‌, నిర్మల్‌ తోమ్‌, అలెక్స్‌ ఆంథోనీ, హర్ష్‌ కుమార్‌, విత్య, పువ్వమ్మ (400 మీ పరుగు), షాలి సింగ్‌ (లాంగ్‌జంప్‌), సంద్రా (ట్రిపుల్‌ జంప్‌), హర్షిత షెరావత్‌ (హ్యామర్‌ త్రో), తజిందర్‌ పాల్‌ సింగ్‌ (షాట్‌పుట్‌), తేజస్విన్‌ శంకర్‌ (హైజంప్‌) కూడా వారి ప్రదర్శనల ఆధారంగా క్రీడల మంత్రిత్వ శాఖ ఈ జాబితాలో చేర్చింది.

"టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించే అవకాశం ఉన్న క్రీడాకారులను వారి ప్రదర్శన ఆధారంగా ఈ టాప్స్‌ ప్రధాన బృందంలో చేర్చాం" అని మంత్రిత్వ శాఖ తెలిపింది. సమీక్ష తర్వాత అర్పిందర్‌ సింగ్‌ (ట్రిపుల్‌ జంప్‌)ను ఈ పథకం నుంచి తప్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.