ETV Bharat / sports

'ఆ క్రీడాకారులకే కొవిడ్​ టీకాలో తొలి ప్రాధాన్యం'

ఒలింపిక్స్​కు అర్హత సాధించిన లేదా సాధించే అవకాశమున్న క్రీడాకారులకే కొవిడ్​ టీకాలో తొలి ప్రాధాన్యమని క్రీడల మంత్రి కిరన్​ రిజిజు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న విశ్వటోర్నీ కోసం వీలైనంత త్వరగా అర్హత పోటీలను నిర్వహించాలని క్రీడా సంఘాలకు మంత్రి విజ్ఞప్తి చేశారు.

Olympic-bound athletes will be given priority when COVID-19 vaccine is available: Kiren Rijiju
'ఆ క్రీడాకారులకే కొవిడ్​ టీకాలో తొలి ప్రాధాన్యం'
author img

By

Published : Nov 30, 2020, 6:44 AM IST

టోక్యో ఒలింపిక్స్‌కు ఇప్పటికే అర్హత సాధించిన, బెర్తు సంపాదించే అవకాశం ఉన్న అథ్లెట్లకు కొవిడ్‌ టీకాలో తొలి ప్రాధాన్యం దక్కేలా చూస్తామని క్రీడల మంత్రి కిరన్‌ రిజిజు అన్నారు. వచ్చే ఏడాది ఒలింపిక్స్‌ ఉన్న నేపథ్యంలో వీలైనంత త్వరగా అర్హత పోటీలు జరగాల్సి ఉందని ఆయన చెప్పారు.

"కరోనా టీకా వచ్చినప్పుడు టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లబోయే అథ్లెట్లు, సహాయక సిబ్బందికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనే క్రీడాకారులకు ప్రాముఖ్యత ఉంటుంది. ఈ విషయమై ఆరోగ్య శాఖతో మాట్లాడతాం."

- కిరన్​ రిజిజు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి

అయితే ఒలింపిక్స్​ అర్హత పోటీలను వీలైనంత త్వరగా నిర్వహించాలని జాతీయ క్రీడా సంఘాలను, భారత ఒలింపిక్​ సంఘానికి కిరన్​ రిజిజు సూచించారు. "ఒలింపిక్స్‌ అర్హత పోటీలు వీలైనంత త్వరగా జరగాలి. అన్ని జాతీయ క్రీడా సంఘాలకు, భారత ఒలింపిక్‌ సంఘానికి ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించాం. కరోనా నిబంధనలను పాటిస్తూనే ఈ ఈవెంట్లు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ టోర్నీలకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చినప్పుడు విదేశీ ఆటగాళ్లు 14 రోజుల క్వారంటైన్‌లో ఉండటానికి సిద్ధపడకపోవచ్చు" అని రిజిజు పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.