ETV Bharat / sports

పెరుగుతోన్న వ్యయం.. ఈసారి ఒలింపిక్స్ జరిగేనా? - ఒలింపిక్స్​ నిర్వహణ కమిటీ

టోక్యో ఒలింపిక్స్ తాజా​ వ్యయాన్ని స్థానిక నిర్వహక కమిటీ వెల్లడించింది. గతేడాది కంటే 22 శాతం పెరిగినట్లు తెలిపింది.

Official costs of Tokyo Olympics up by 22 per cent to 15.4 billion
పెరుగుతున్న వ్యయం.. ఈసారి ఒలింపిక్స్ జరిగేనా?
author img

By

Published : Dec 22, 2020, 4:13 PM IST

గతేడాది అంచనాలతో పోలిస్తే ఒలింపిక్స్​ నిర్వహణ వ్యయం 22 శాతం పెరిగిందని స్థానిక నిర్వహణ కమిటీ మంగళవారం వెల్లడించింది. తొలుత రూ.93 వేల కోట్లు అవుతుందని లెక్క వేయగా, ఇప్పుడు ఆ మొత్తం రూ.లక్ష 13 వేల కోట్లకు చేరిందని ప్రకటించింది.

వాస్తవానికి ఇంకా ఎక్కువే..

అధికారిక లెక్కల కన్నా ఒలింపిక్స్​ వ్యయం ఇంకా ఎక్కువే అవుతుందని జపాన్ ఆడిట్ నివేదికలే చెబుతున్నాయి. కనీసం రూ.లక్ష 84వేల కోట్ల వ్యయం కానుందని చెప్పింది. ఈ ఒలింపిక్స్​ అత్యంత ఖరీదైనవిగా ఆక్స్​ఫర్డ్​ విశ్వవిద్యాలయ అధ్యయనం తేల్చింది.

వీరికి భాగస్వామ్యం..

భారం తగ్గించుకునేందుకు పెద్దఎ్తతున్న దేశీయ స్పాన్సర్లకు భాగస్వామ్యం కల్పిస్తోంది నిర్వహణ కమిటీ. ఇప్పటికే 70కి పైగా స్పాన్సర్లు రూ.24వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. నిర్వహణ కమిటీ భరించలేని వ్యయం.. టోక్యో, జపాన్​ ప్రభుత్వాలపైనే పడుతుంది.

వాయిదా వేస్తే?

ఇటీవలే చేసిన సర్వేలో 63శాతం మంది ఒలింపిక్స్​ను వాయిదా లేదా రద్దు చేయాలని చెప్పారు. ఒకవేళ ఈసారి మెగా క్రీడల్ని జరపకపోతే శాశ్వతంగా రద్దవుతాయని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం సహా స్థానిక నిర్వాహకులు తెలిపారు.

ఇదీ చూడండి:'భజ్జీ ఔట్ చేశాడు.. టెక్నిక్​పై నమ్మకం పోయింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.