ETV Bharat / sports

అవమానాలు.. విమర్శలు.. ప్రతికూలతలు.. అయినా జకో తగ్గేదేలే! - అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ జకోవిచ్

Novak Djokovic Wimbledon: 'ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవాలంటే ముందు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉండాలి' అని చెప్పే జకోవిచ్..​ దాన్ని చేతల్లోనూ నిరూపిస్తున్నాడు. టెన్నిస్​లో ఆల్‌టైమ్‌ దిగ్గజంగా ఎదిగేలా దూసుకెళ్తున్నాడు. వింబుల్డన్ 2022 విజేతగా నిలిచిన నొవాక్ జకోవిచ్ పస్తుతం అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో రెండో స్థానానికి చేరాడు.

novak djokovic wimbledon
నొవాక్‌ జకోవిచ్‌
author img

By

Published : Jul 11, 2022, 7:00 AM IST

Novak Djokovic Wimbledon: ప్రపంచ నంబర్‌వన్‌ కావాలని.. గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు గెలవాలని.. కెరీర్‌ ఆరంభంలో ఆ ఆటగాడు కల కన్నాడు. ఇద్దరు దిగ్గజాల రూపంలో గట్టి పోటీ.. కానీ అతను ఆగిపోలేదు. అత్యుత్తమ ఫామ్‌తో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ విజయాల దిశగా దూసుకెళ్తున్న వేళ.. అనుకోని అవరోధాలు.. కానీ అతను బెదరలేదు. విమర్శలు వచ్చినా.. అవమానాలు పలకరించినా.. ప్రతికూలతలు వెంటాడినా.. పోరాటమే శ్వాసగా.. ఆత్మవిశ్వాసం అండగా.. శిగరాగ్రానికి చేరే వైపుగా అడుగులు వేస్తున్నాడు. అతనే.. నొవాక్‌ జకోవిచ్‌. తాజాగా వింబుల్డన్‌ విజయంతో.. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో రెండో స్థానానికి చేరాడు.

"ఎవరైనా తమ కలలను సాకారం చేసుకోవాలంటే ముందు వాళ్ల మీద వాళ్లకు నమ్మకం ఉండాలి".. ఇవీ 35 ఏళ్ల జకోవిచ్‌ చెప్పే మాటలు. చెప్పడమే కాదు దీన్ని చేతల్లోనూ నిరూపిస్తూ ఆల్‌టైమ్‌ దిగ్గజంగా ఎదిగేలా అతను దూసుకెళ్తున్నాడు. తన కెరీర్‌ ఆరంభం నుంచి సవాళ్లను దాటి సాగడం అతనికి అలవాటుగా మారింది. తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయం కోసం మూడేళ్ల పాటు నిరీక్షించాల్సి వచ్చినా.. మధ్యలో ఆట గాడితప్పి ఓటములు దరి చేరినా.. అతనెప్పుడూ పోరాటాన్ని వదల్లేదు. తనను తాను ఎప్పటికప్పుడూ సరికొత్తగా మార్చుకుంటున్నాడు. ఈ వింబుల్డన్‌ క్వార్టర్స్‌లో రెండు సెట్లు, సెమీస్‌లో ఓ సెట్‌ కోల్పోయిన తర్వాత అతను పుంజుకుని గెలిచిన తీరు అద్భుతం. ఫైనల్లోనూ తొలి సెట్లో ఓటమి తర్వాత గొప్పగా రాణించి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. వింబుల్డన్‌లో వరుసగా 28వ మ్యాచ్‌లో విజయాన్ని నమోదు చేశాడు.

ఆల్‌రౌండర్‌..: టెన్నిస్‌ చరిత్రలో మూడు గ్రాండ్‌స్లామ్‌ల్లో కనీసం ఎనిమిది ఫైనల్స్‌ ఆడిన తొలి ఆటగాడు జకోవిచ్‌.. అతను ఆల్‌రౌండర్‌ అని చాటి చెప్పడానికి ఈ రికార్డు చాలు. హార్డ్‌, గ్రాస్‌, క్లే.. ఇలా ఉపరితలం ఏదైనా విజయాలు సాధించడమే అతనికి తెలుసు. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో తొమ్మిది సార్లు టైటిల్‌ పోరుకు చేరి.. ప్రతిసారి విజేతగా నిలిచాడు. వింబుల్డన్‌లో ఎనిమిది ఫైనల్స్‌లో ఏడుసార్లు ట్రోఫీని ముద్దాడాడు. యుఎస్‌ ఓపెన్‌లో తొమ్మిది ఫైనల్స్‌కు గాను మూడు సార్లు టైటిల్‌ నెగ్గాడు. ఇక ఫ్రెంచ్‌ ఓపెన్‌ విషయానికి వస్తే ఆరు సార్లు ఫైనల్‌ ఆడి.. రెండు టైటిళ్లు సాధించాడు. ఫెదరర్‌ ఏమో వింబుల్డన్‌లో అదరగొట్టాడు. నాదల్‌కు ఫ్రెంచ్‌ ఓపెన్‌ పెట్టని కోటగా మారింది. కానీ జకో మాత్రం అన్ని కోర్టుల్లో ఆధిపత్యం సాగిస్తున్నాడు. అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్స్‌ (32) ఆడిన ఆటగాడిగానూ ఫెదరర్‌ (31)ను వెనక్కినెట్టాడు. మరోవైపు ప్రతికూల పరిస్థితులను దాటే ఆత్మస్థైర్యం అతని సొంతం. కొవిడ్‌ టీకా వేసుకోలేదనే కారణంతో ఈ ఏడాది ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడకుండానే ఆ దేశ ప్రభుత్వం అతణ్ని అక్కడి నుంచి పంపించేసింది. ఈ ఘటనతో నిరాశ చెందిన అతను కాస్త విరామం తీసుకున్నాడు. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో క్వార్టర్స్‌ దాటలేకపోయాడు. దీంతో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంకూ చేజారింది. కానీ తిరిగి ఆటపై దృష్టి సారించి మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. తనకు ఎంతో అచ్చొచ్చిన వింబుల్డన్‌లో విజయ పతాకం ఎగరేశాడు.

నాదల్‌తో నువ్వానేనా: అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లలో ఫెదరర్‌ను వెనక్కినెట్టిన జకోవిచ్‌ ఇప్పుడు రెండో స్థానానికి చేరుకున్నాడు. కేవలం నాదల్‌ (22) మాత్రమే అతని కంటే ముందున్నాడు. ఈ నేపథ్యంలో మంచి ఫిట్‌నెస్‌తో ఉన్న జకో.. నాదల్‌ను దాటి అత్యధిక విజయాలు సాధించిన ఆటగాడిగా నిలవడం ఖాయమనిపిస్తోంది. ఎందుకంటే మోకాలికి శస్త్రచికిత్సలతో ఫెదరర్‌ చాలా కాలంగా ఆటకు దూరంగా ఉంటున్నాడు. అతని కెరీర్‌ దాదాపుగా ముగిసినట్లే. ఇక నాదల్‌కూ ఫిట్‌నెస్‌ సమస్యలున్నాయి. పాదం గాయం వేధిస్తోంది. మరోవైపు వింబుల్డన్‌లో పొత్తి కడుపు గాయంతో సెమీస్‌ ఆడకుండానే తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలో నాదల్‌ను దాటడం జకోవిచ్‌కు పెద్ద కష్టమేమీ కాదు. అతను మరో నాలుగైదు టైటిళ్లు గెలిచి ఎవరికి అందనంత ఎత్తులో నిలిచేలా కనిపిస్తున్నాడు.

ఇవీ చదవండి: డైనోసర్‌లా 'పంత్‌'.. టీ20 వరల్డ్​కప్​ ప్రోమోతో ఐసీసీ సర్​ప్రైజ్​!

చరిత్ర సృష్టించిన రిబకినా.. వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌ కైవసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.