ప్రపంచ మహిళా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత బాక్సర్లు విజృంభిస్తున్నారు. ఇప్పటికే రెండు స్వర్ణాలు సాధించిన భారత బాక్సర్లు మరో రెండు పసిడి పతాకాలను సాధించారు. 75 కేజీల విభాగంలో మరో భారత బాక్సింగ్ ఛాంపియన్ లవ్లీనా బోర్గోహెయిన్ పసిడి పతకాన్ని ఒడిసిపట్టారు. ఫైనల్‌లో ఆస్ట్రేలియాకు చెందిన కైత్లిన్ పార్కర్‌పై 5-2 తేడాతో విజయం సాధించారు. ఇప్పటికే యువ బాక్సర్ నిఖత్ జరీన్ మరోసారి సత్తా చాటారు. ఆదివారం దిల్లీ వేదికగా జరిగిన అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం(ఐబీఏ) వరల్డ్ సీనియర్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా 50 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో వియత్నాంకు చెందిన క్రీడాకారిణి టి తామ్ న్యూయెన్ను 5-0 తేడాతో ఓడించి విజయం సాధించారు. ఈ ఫీట్‌తో నిఖత్ వరుసగా రెండో ఏడాది ఐబీఏ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచి విజేతగా నిలిచారు.
తెలంగాణకు చెందిన నిఖత్ జరీన్ టోర్నమెంట్ ఫైనల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. సీనియర్ విభాగంలో దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ తర్వాత ఒకటి కంటే ఎక్కువ సార్లు ప్రపంచ టైటిళ్లను గెలిచిన రెండో భారత బాక్సర్‌గా చరిత్ర సృష్టించారు. అంతేగాక బాక్సింగ్‌లో రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయిగా నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించారు. కాగా, ఈ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటికే 48 కేజీల విభాగంలో నీతూ ఘాంగస్, 81 కేజీల విభాగంలో స్వీటీ బూర పసిడి పతకాలను ఒడిసిపట్టారు.
ఈ ప్రత్యర్థులతో బరిలోకి..
50 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పోటీపడ్డ నిఖత్ జరీన్ ఈ టోర్నీ తొలి రౌండ్‌లో అజర్‌బైజాన్ క్రీడాకారిణి ఇస్మాయిలోవా అనఖనిమ్తో తలపడి 5-0తో గెలుపొందారు. ఏకపక్షంగా సాగిన బౌట్ రెండో రౌండ్‌లోనూ టాప్ సీడర్ అల్జీరియా ప్రత్యర్థి బొవులామ్ రౌమస్యాపై 5-0తో నెగ్గారు. ఇక ప్రిక్వార్టర్స్ మ్యాచ్‌లో కూడా మెక్సికోకి చెందిన హరీరా అల్వారెజ్ ఫాతిమాను 5-0తో సునాయాసంగా ఓడించారు. కాగా, క్వార్టర్స్‌లో నిఖత్‌కు థాయ్‌లాండ్ క్రీడాకారిణి రక్సత్ చౌథామట్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఈ బౌట్‌లో నిఖత్ 5-2తో రక్సత్‌ను మట్టికరిపించారు. సెమీఫైనల్లో కూడా ఐదో సీడర్ కొలంబియా క్రిడాకారిణి వాలెన్సియా క్టోరియాపై 5-0తో నెగ్గి వరుసగా రెండో ఏడాది వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌కు అర్హత సాధించారు.
-
𝐂𝐎𝐍𝐒𝐄𝐂𝐔𝐓𝐈𝐕𝐄 𝐆𝐎𝐋𝐃 :first_place_medal: 𝐅𝐎𝐑 𝐍𝐈𝐊𝐇𝐀𝐓 𝐙𝐀𝐑𝐄𝐄𝐍 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐁𝐎𝐗𝐈𝐍𝐆 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 :boxing_glove:#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">𝐂𝐎𝐍𝐒𝐄𝐂𝐔𝐓𝐈𝐕𝐄 𝐆𝐎𝐋𝐃 :first_place_medal: 𝐅𝐎𝐑 𝐍𝐈𝐊𝐇𝐀𝐓 𝐙𝐀𝐑𝐄𝐄𝐍 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐁𝐎𝐗𝐈𝐍𝐆 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 :boxing_glove:#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023𝐂𝐎𝐍𝐒𝐄𝐂𝐔𝐓𝐈𝐕𝐄 𝐆𝐎𝐋𝐃 :first_place_medal: 𝐅𝐎𝐑 𝐍𝐈𝐊𝐇𝐀𝐓 𝐙𝐀𝐑𝐄𝐄𝐍 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐖𝐨𝐦𝐞𝐧'𝐬 𝐖𝐨𝐫𝐥𝐝 𝐁𝐎𝐗𝐈𝐍𝐆 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 :boxing_glove:#WorldChampionships #WWCHDelhi #Boxing #WBC2023 #WBC @nikhat_zareen #NikhatZareen pic.twitter.com/EjktqCP4pi
— Doordarshan Sports (@ddsportschannel) March 26, 2023
నిఖత్ పతకాల పంట..
ఇప్పటికే పలు జాతీయ, అంతర్జాతీయ టోర్నమెంట్లు ఆడిన నిఖత్.. 2011లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన అంతర్జాతీయ విమెన్స్ యూత్ అండ్ జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. ఇది ఆమె కెరీర్‌లో తొలి పెద్ద అడుగు. ఆ తర్వాత నిలకడగా ఆడుతూ మెరుగైన ప్రదర్శనను కనబరిచిన నిఖత్ గతేడాది తొలిసారి సినియర్ స్థాయిలో గోల్డ్ మెడల్ ముద్దాడి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. అంతేగాక ఇప్పటివరకు నిఖత్ సాధించిన టైటిల్స్ ఇవి..
- 2014- నేషన్స్ కప్- స్వర్ణం
- 2015- జాతీయ సీనియర్ ఛాంపియన్‌షిప్- గోల్డ్ మెడల్
- 2018- సెర్బియాలోని బెల్‌గ్రేడ్- స్వర్ణ పతకం
- 2019- థాయ్‌లాండ్ ఓపెన్- సిల్వర్ మెడల్
- 2019, 2022- స్ట్రాంజా మెమోరియల్- బంగారు పతకం
- 2022- ప్రపంచ ఛాంపియన్‌షిప్(ఇస్తాంబుల్)- స్వర్ణం
- 2022- కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం