ETV Bharat / sports

జాతీయ మహిళల బాక్సింగ్‌ ఫైనల్లో నిఖత్​ - World boxing championship

జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen news) ఫైనల్​కు చేరుకుంది. బుధవారం జరగనున్న ఫైనల్లో మీనాక్షితో(హరియాణ) నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ ఆటగాడు శివ థాపా (63.5 కేజీ) శుభారంభం చేశాడు.

National Women's Boxing
జాతీయ మహిళల బాక్సింగ్‌
author img

By

Published : Oct 27, 2021, 6:41 AM IST

జాతీయ మహిళల బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌(Nikhat Zareen news) ఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం 50-52 కేజీల సెమీఫైనల్‌ బౌట్‌లో నిఖత్‌ 5-0తో రాశి శర్మను చిత్తుచేసింది. బుధవారం జరిగే ఫైనల్లో మీనాక్షితో(హరియాణ) నిఖత్‌ అమీతుమీ తేల్చుకోనుంది. మరో క్రీడాకారిణి నిహారిక గోనెళ్ల పోరాటం ముగిసింది. 60-63 కేజీల సెమీస్‌లో నిహారిక 1-4తో జ్యోతి (రైల్వేస్‌) చేతిలో పరాజయం చవిచూసింది. సెమీస్‌లో ఓడిన నిహారికకు కాంస్య పతకం దక్కింది.

శివ, ఆకాశ్‌, రోహిత్‌ శుభారంభం

సెర్బియాలోని బెల్​గ్రేడ్​లో జరిగిన​ ఏఐబీఏ ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో(World boxing championship) భారత స్టార్‌ ఆటగాడు శివ థాపా (63.5 కేజీ) శుభారంభం చేశాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్​లో శివ 5-0తో విక్టర్‌ న్యాదెరాపై(కెన్యా) విజయం సాధించాడు. 67 కేజీలలో ఆకాశ్‌ సాంగ్వాన్‌ 5-0తో ఫర్కాన్‌ ఆడెమ్‌పై(టర్కీ), 57 కేజీలలో రోహిత్‌ మోర్‌ 5-0తో జీన్‌ కైసిడొపై(ఈక్వెడార్‌) నెగ్గి రెండో రౌండ్​లో అడుగుపెట్టారు. సంజీత్‌ (92 కేజీ), సచిన్‌కుమార్‌లకు(80 కేజీ) తొలి రౌండ్​లో బై లభించింది.

ఇదీ చూడండి: టీమ్ఇండియా కోచ్ పదవికి ద్రవిడ్ దరఖాస్తు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.