డైట్, ఫిట్నెస్, స్పోర్ట్స్‌పై విద్యార్థులు, అథ్లెట్స్‌లో అవగాహన కల్పించేందుకు ఓ ప్రత్యేక కార్యక్రమానికి ప్రారంభించాడు టోక్యో ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత నీరజ్ చోప్డా. అహ్మాదాబాద్ సంస్కార్థామ్ స్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యకమానికి 75 పాఠశాలల నుంచి విద్యార్థులు హాజరయ్యారు. వారితో కలిసి వివిధ ఆటలు ఆడిన నీరజ్.. జావెలిన్ త్రోకు సంబంధించి కొన్ని టిప్స్ చెప్పాడు.
ఇందులో భాగంగా తనకు ఇష్టమైన ఫుడ్ వెజ్ బిర్యానీ అని చెప్పిన నీరజ్.. పెరుగుతో కలిపి దాన్ని తింటే శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయని అన్నాడు. ఫిట్ ఇండియా క్విజ్ గురించి కూడా పిల్లలతో చర్చించాడు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో సంస్కార్థామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చేస్తున్న కృషిపై ప్రశంసలు కురిపించాడు.
ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చే రెండు నెలల్లో.. తరుణ్ దీప్ రాయ్(ఆర్చరీ), సార్థక్ భాంబ్రి(అథ్లెటిక్స్), సుశీలా దేవి(జూడో), కేసీ గణపతి, వరుణ్ థక్కర్(సెయిలింగ్) కూడా దేశంలోని ఇతర పాఠశాలలకు వెళ్లి క్రీడలు, ఫిట్‌నెస్‌పై విద్యార్థుల్లో అవగాహన పెంచనున్నారు.
ఇదీ చదవండి:
AB De Villiers RCB: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్‌గా ఏబీ డివిలియర్స్!
IND vs NZ 2nd test: భారత్-న్యూజిలాండ్ టెస్టు.. హెచ్డీ ఫొటోల్లో