ETV Bharat / sports

మళ్లీ మెరిసిన నీరజ్​ చోప్రా.. ఈసారి జాతీయ రికార్డు కైవసం - Neeraj chopra javellin

Neeraj chopra: టోక్యో ఒలింపిక్స్​ గోల్డ్​ మెడలిస్ట్​, జావెలిన్​ త్రోయర్​ నీరజ్​ చోప్రా.. మళ్లీ మెరిశాడు. ఫిన్లాండ్​లో జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీ. బల్లెం విసిరి జాతీయ రికార్డు సృష్టించాడు.

neeraj chopra national record
నీరజ్​ చోప్రా జాతీయ రికార్డు
author img

By

Published : Jun 15, 2022, 7:54 AM IST

Neeraj chopra: టోక్యో ఒలింపిక్స్​ స్వర్ణ విజేత నీరజ్​ చోప్రా మరో రికార్డ్​ సృష్టించాడు. జాతీయ రికార్డును నమోదు చేశాడు. ఫిన్లాండ్​ ​ వేదికగా జరిగిన పావో నుర్మీ గేమ్స్​లో 89.30 మీటర్లు బల్లెం విసిరి ఈ ఫీట్​ నమోదు చేశాడు. గతేడాది మార్చిలో పటియాలా వేదికగా 88.07, టోక్యో ఒలింపిక్స్​లో 87.58 మీటర్లు విసిరి గోల్డ్​ మెడల్​ సాధించాడు. కాగా, ప్రస్తుత ఈవెంట్​లో అతడి రజత పతకం దక్కింది. తొలి రౌండ్​ను 86.92 మీటర్లతో ప్రారంభించిన అతడు.. తర్వాత మూడు ప్రయత్నాల్లో ఫౌల్​ అయ్యాడు. చివరిదైన ఆరో ప్రయత్నంలో 85.85 మీటర్లు విసిరాడు.

ఈ పోటీలో పాల్గొనే ముందు నీరజ్​ ఓ ఇంటర్వ్వూలో పాల్గొన్నాడు. భారత్‌లోని పలువురు అథ్లెట్లు 80 మీటర్లకుపైగా జావెలిన్‌ త్రో చేస్తున్నారని తెలిసి మీరెలా ఫీలవుతున్నారని అడిగిన ప్రశ్నకు అతడు ఇలా బదులిచ్చాడు. "చాలా సంతోషంగా ఉంది. మన దేశంలో చాలా మంది అథ్లెట్లు 80+ మీటర్లు జావెలిన్‌ విసురుతున్నారు. రోహిత్, యశ్విర్‌, మను, సాహిల్‌తో పాటు పలువురు జూనియర్లు కూడా మంచి ప్రదర్శన చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలోనూ అండర్సన్‌ పీటర్స్‌, జాకుబ్‌ వాద్లెచ్‌ వంటి అథ్లెట్లు ఈ ఏడాది 90+ మీటర్లు విసిరారు. దీంతో జావెలిన్‌ త్రో ఆటలో కొత్త రికార్డులు నమోదవుతున్నాయి" అని పేర్కొన్నాడు. ఇక రాబోయే టోర్నమెంట్లలో ఎలాంటి ప్రదర్శన చేయాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు.. "ఈ ఏడాది మరింత నిలకడగా రాణించాలనుకుంటున్నా. నా ఫిట్‌నెస్‌ కొనసాగిస్తూ అత్యుత్తమ ప్రదర్శన చేసి మెరుగైన ఫలితాలు సాధించాలని అనుకుంటున్నా. ఇప్పుడు నేను 90 మీటర్ల దూరానికి చేరువలో ఉన్నా. ఇప్పుడు 90+ మీటర్ల రికార్డు చేరితే చాలా సంతోషంగా ఉంటా. నేను ఆ అరుదైన క్లబ్‌లో ఉండాలనుకుంటున్నా" అని నీరజ్‌ చెప్పుకొచ్చాడు.

ఇదీ చూడండి: బెయిర్​స్టో మెరుపు శతకం.. ఇంగ్లాండ్​దే రెండో టెస్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.