ETV Bharat / sports

16 మంది ఎన్​బీఏ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ - NBA restart news

వచ్చే నెల 30వ తేదీ నుంచి ఎన్​బీఏ కొత్త సీజన్​ మొదలు కానుంది. ఈ క్రమంలో చేసిన వైద్యపరీక్షల్లో 16 మంది ప్లేయర్లకు కరోనా సోకినట్లు తేలింది.

16 మంది ఎన్​బీఏ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్
ఎన్​బీఏ ఆటగాళ్లకు కరోనా
author img

By

Published : Jun 27, 2020, 10:03 AM IST

ఎన్​బీఏ బాస్కెట్​బాల్ లీగ్​-2020 సీజన్​ను జులై 30 నుంచి ప్రారంభించాలని నిర్వహకులు భావించారు. ఈ నేపథ్యంలో 302 మంది ప్లేయర్లకు కరోనా పరీక్షలు నిర్వహించగా, ఫలితాల్లో 16 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ విషయాన్ని ఎన్​బీఏ శుక్రవారం వెల్లడించింది. వైరస్​ సోకిన వాళ్లు.. తగ్గిన తర్వాత ఆటలో పాల్గొనాలంటే వైద్యుడి ధ్రువీకరణ పత్రం తీసుకురావాలని స్పష్టం చేసింది.

అయితే సక్రమెంటో కింగ్స్​కు చెందిన ఆటగాళ్లు జబారీ పార్కర్, అలెక్స్ లెన్​తో పాటు ఇండియానా పేసర్స్​ ప్లేయర్ మాల్కమ్ బ్రోగ్డన్​.. తమకు కరోనా సోకిందని బుధవారమే తెలిపారు.

ప్రస్తుత సీజన్​ ఫ్లోరిడాలోని డిస్నీలాండ్​లో నిర్వహించనున్నారు. మొత్తం 22 జట్లు పాల్గొనున్నాయి. అక్టోబరులో ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.