జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక ప్రక్రియ(National sports awards selection) ఈసారి ఆలస్యం కానుంది. టోక్యో ఒలింపిక్స్‌లో క్రీడాకారుల ప్రదర్శనను పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తుండటమే ఇందుకు కారణం. ప్రతి ఏడాది ఆగస్టు 29న మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి(major dhyan chand birth anniversary) సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం రోజు పురస్కారాలు అందజేస్తారు.
"ఈ ఏడాది జాతీయ క్రీడా పురస్కారాల కోసం దరఖాస్తులు స్వీకరించాం. దరఖాస్తులకు తుది గడువు కూడా ముగిసింది. అయితే ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే క్రీడాకారుల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని గత సమావేశంలో నిర్ణయించాం. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగుస్తాయి. కాబట్టి అవార్డుల ఎంపిక ప్రక్రియ కాస్త ఆలస్యం కానుంది. ఒలింపిక్స్‌లో ఎవరైనా పతకం గెలిస్తే ఆ ప్రదర్శనను కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటాం" అని క్రీడా శాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చదవండి: జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకొంటారు?