2021 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా అవార్డుల (National Sports Awards 2021) విజేతలకు పురస్కారాలు స్వయంగా బహుకరించారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind News). కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
-
Olympian Neeraj Chopra receives Major Dhyan Chand Khel Ratna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/eacGZNOB34
— ANI (@ANI) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Olympian Neeraj Chopra receives Major Dhyan Chand Khel Ratna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/eacGZNOB34
— ANI (@ANI) November 13, 2021Olympian Neeraj Chopra receives Major Dhyan Chand Khel Ratna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/eacGZNOB34
— ANI (@ANI) November 13, 2021
ఈ కార్యక్రంలో మొత్తం 12 మంది క్రీడాకారులకు మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న (Khel Ratna Award 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి. వీరిలో టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్డా(అథ్లెటిక్స్), మన్‌ప్రీత్ సింగ్, శ్రీజేశ్ (హాకీ), రవి కుమార్(రెజ్లింగ్), లవ్లీనా బోర్గోహైన్(బాక్సింగ్) ఉన్నారు.
పారాలింపిక్స్ అథ్లెట్లు అవనీ లేఖరా, సుమిత్ అంతిల్, ప్రమోద్ భగత్, కృష్ణ నాగర్, మనీష్ నర్వాల్, మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్, ఫుట్‌బాలర్ సునీల్ ఛెత్రి.. కూడా ఈ ఏడాది ఖేల్‌రత్న అవార్డు అందుకున్నారు.
-
#WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn
— ANI (@ANI) November 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn
— ANI (@ANI) November 13, 2021#WATCH | Cricketer Shikhar Dhawan receives Arjuna Award from President Ram Nath Kovind at Rashtrapati Bhavan in New Delhi pic.twitter.com/X7G45x9lzn
— ANI (@ANI) November 13, 2021
అర్జున అవార్డు గ్రహీతలు
నిషద్ కుమార్ (హైజంప్), ప్రవీణ్ కుమార్ (హైజంప్), శరద్ కుమార్ (హైజంప్), యోగేష్ కథునియా (డిస్కస్ త్రో), సుహాస్ ఎల్వై (బ్యాడ్మింటన్), సింగ్‌రాజ్ అధానా (షూటింగ్), భవినా పటేల్ (టేబుల్ టెన్నిస్), హర్విందర్ సింగ్ (ఆర్చరీ), శిఖర్ ధావన్ (క్రికెట్) సహా శ్రీజేశ్, మన్‌ప్రీత్ మినహా హాకీ ఇండియా పురుషుల జట్టుకు అర్జున అవార్డు (Arjuna Award 2021) ప్రదానం చేశారు.
గతేడాదివి కూడా ఈ నెల్లోనే..
2020 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డుల (2020 National Sports Awards) విజేతలకు నవంబర్ 1నే ట్రోఫీలను స్వయంగా బహుకరించారు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. కరోనా కారణంగా గతేడాది ఈ అవార్డుల ప్రదానోత్సవం వర్చువల్‌గా జరిగింది.
-
Congratulations to all the Awardees of Khel Ratna 2020, Arjuna Award 2020, Dronacharya Award 2020 (Lifetime & Regular category).
— Anurag Thakur (@ianuragthakur) November 1, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Wishing you even greater success ahead !#NationalSportsAward2020 pic.twitter.com/hFOiUUSWkm
">Congratulations to all the Awardees of Khel Ratna 2020, Arjuna Award 2020, Dronacharya Award 2020 (Lifetime & Regular category).
— Anurag Thakur (@ianuragthakur) November 1, 2021
Wishing you even greater success ahead !#NationalSportsAward2020 pic.twitter.com/hFOiUUSWkmCongratulations to all the Awardees of Khel Ratna 2020, Arjuna Award 2020, Dronacharya Award 2020 (Lifetime & Regular category).
— Anurag Thakur (@ianuragthakur) November 1, 2021
Wishing you even greater success ahead !#NationalSportsAward2020 pic.twitter.com/hFOiUUSWkm
విజేతలందరికీ ఇదివరకే నగదు బహుమానం అందింది. కానీ, మహమ్మారి కారణంగా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను అందుకోలేకపోయారు. గతేడాది ఆగస్టు 29న 5 ఖేల్‌రత్న సహా 74 జాతీయ క్రీడా అవార్డులను (Sports Awards In India 2020) ప్రదానం చేసింది క్రీడల శాఖ.ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణీ రాంపాల్, స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్, 2016 పారాలింపిక్స్ పసిడి విజేత తంగవేలు మరియప్పన్ ఉన్నారు. వారికి ఖేల్‌రత్న (Khel Ratna Award 2020) లభించింది.టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లవ్లీనా, క్రికెటర్ ఇషాంత్ శర్మ, స్ప్రింటర్ ద్యుతి చంద్, ఆర్చర్ అతాను దాస్, షట్లర్లు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి అర్జున (Arjuna Award 2020) ట్రోఫీలను అందుకున్నారు.
ఇవీ చూడండి:
కేంద్రమంత్రికి పీవీ సింధు పాఠాలు..!