National Awards 2023 : రాష్ట్రపతి భవన్ వేదికగా జాతీయ అవార్డుల ప్రధానోత్సవ వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లోని అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్లేయర్లకు అవార్డులను అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదగా టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami Arjuna Award) అర్జున అవార్డును అందుకున్నాడు.
-
VIDEO | Cricketer @MdShami11 receives Arjuna Award from President Droupadi Murmu at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn pic.twitter.com/agDi8Vy7CD
— Press Trust of India (@PTI_News) January 9, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
">VIDEO | Cricketer @MdShami11 receives Arjuna Award from President Droupadi Murmu at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn pic.twitter.com/agDi8Vy7CD
— Press Trust of India (@PTI_News) January 9, 2024VIDEO | Cricketer @MdShami11 receives Arjuna Award from President Droupadi Murmu at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn pic.twitter.com/agDi8Vy7CD
— Press Trust of India (@PTI_News) January 9, 2024
ఇక షమీతో పాటు చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్.వైశాలీ, పిస్టల్ షూటింగ్ సెన్సేషన్ ఈషా సింగ్, రెజ్లర్ అంతిమ్ పంఘాల్, బాక్సర్ మహమ్ముద్ హుస్సాముద్దీన్, పారా ఆర్చర్ సీతల్ దేవీ అర్జున అవార్డు అందుకున్నారు. చెస్ క్రీడాకారుడు ప్రజ్ఞానందా కోచ్ ఆర్బీ రమేశ్ ద్రోణాచార్య పురస్కారాన్ని అందుకున్నారు. అయితే ఖేల్ రత్న అవార్డు గ్రహీతలు సాత్విక్ సాయి రాంకీరెడ్డి, చిరాగ్ శెట్టి ప్రస్తుతం మలేషియా ఓపెన్ సూపర్ 1000లో ఆడుతున్నందున ఈ అవార్డుల ప్రదానోత్సవానికి హాజరు కాలేకపోయారు.
నగదు బహుమతి : అవార్డు గ్రహీతలకు ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డుకు రూ. 25 లక్షలు, అర్జున, ద్రోణాచార్య పురస్కారానికి గానూ రూ. 15 లక్షల నగదు పురస్కారం అందుకుంటారు. సాధారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవం హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ జయంతి అయిన ఆగస్టు 29న జరగాల్సింది. అయితే గతేడాది హాంగ్జౌలో సెప్టెంబర్ 23నుంచి అక్టోబర్ 8వరకు ఆసియా క్రీడలు జరగటం వల్ల ఈ వేడుకను వాయిదా వేశారు.
-
VIDEO | President Droupadi Murmu presents National Sports and Adventure Awards 2023 at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn
— Press Trust of India (@PTI_News) January 9, 2024 " class="align-text-top noRightClick twitterSection" data="
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/doxINfFiqS
">VIDEO | President Droupadi Murmu presents National Sports and Adventure Awards 2023 at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn
— Press Trust of India (@PTI_News) January 9, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/doxINfFiqSVIDEO | President Droupadi Murmu presents National Sports and Adventure Awards 2023 at Rashtrapati Bhavan, Delhi.@rashtrapatibhvn
— Press Trust of India (@PTI_News) January 9, 2024
(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/doxINfFiqS
మేజర్ ధ్యాన్ చంద్ 'ఖేల్ రత్న' అవార్డులు: చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి (బ్యాడ్మింటన్).
అర్జున అవార్డులు: ఓజాస్ ప్రవీణ్ డియోటాలే (ఆర్చరీ), అదితి గోపీచంద్ స్వామి (ఆర్చరీ), మురళీ శ్రీశంకర్ (అథ్లెటిక్స్), పారుల్ చౌదరి (అథ్లెటిక్స్), మహ్మద్ హుస్సాముద్దీన్ (బాక్సింగ్), ఆర్ వైశాలి (చెస్), మహ్మద్ షమీ (క్రికెట్), అనుష్ అగర్వాలా ( ఈక్వెస్ట్రియన్), దివ్యకృతి సింగ్ (ఈక్వెస్ట్రియన్ డ్రెస్సేజ్), దీక్షా దాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్ (హాకీ), సుశీల చాను (హాకీ), పవన్ కుమార్ (కబడ్డీ), రీతు నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో-ఖో), పింకీ ( లాన్ బౌల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్ (షూటింగ్), ఈషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ సింగ్ సంధు (స్క్వాష్), ఐహికా ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్ కుమార్ (రెజ్లింగ్), ఆంటిమ్ పంఘల్ (రెజ్లింగ్), నౌరెమ్ రోషిబినా దేవి (వుషు), శీతల్ దేవి (పారా ఆర్చరీ), ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి (బ్లైండ్ క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కానోయింగ్).
అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు (రెగ్యులర్ కేటగిరీ): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్‌బి రమేష్ (చెస్), మహావీర్ ప్రసాద్ సైనీ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేష్ ప్రభాకర్ దేవరుఖ్కర్ (మల్లాఖాంబ్).
అత్యుత్తమ కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డు (లైఫ్ టైమ్ కేటగిరీ): జస్కిరత్ సింగ్ గ్రేవాల్ (గోల్ఫ్), భాస్కరన్ ఇ (కబడ్డీ), జయంత కుమార్ పుషీలాల్ (టేబుల్ టెన్నిస్).
ధ్యాన్‌చంద్ అవార్డ్ ఫర్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ : మంజుషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ కుమార్ శర్మ (హాకీ), కవిత సెల్వరాజ్ (కబడ్డీ).
మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 2023: గురునానక్ దేవ్ విశ్వవిద్యాలయం, అమృత్‌సర్ (ఓవరాల్ విన్నర్ యూనివర్సిటీ); లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్ (తొలి రన్నరప్), కురుక్షేత్ర విశ్వవిద్యాలయం, కురుక్షేత్ర (రెండవ రన్నరప్)
అందులోనూ సాత్విక్ జోడీ టాప్.. సింధుకు మళ్లీ నిరాశే..
చిరాగ్, సాత్విక్ జోడీకి ఖేల్‌రత్న- షమీకి అర్జునా అవార్డు- ప్రకటించిన క్రీడా శాఖ