ETV Bharat / sports

అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్​ పదవికి 'బత్రా' రాజీనామా - narinder batra resign indian olympic association member ship

అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్​ఎఫ్​) అధ్యక్షుడు నరిందర్ బత్రా కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐహెచ్​ఎఫ్ చీఫ్ పదవితో పాటు ఐఓఏ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

Narinder Batra resigns as International Hockey Federation president
అంతర్జాతీయ హాకీ సమాఖ్య చీఫ్​ పదవికి 'బత్రా' రాజీమానా
author img

By

Published : Jul 18, 2022, 1:51 PM IST

Updated : Jul 18, 2022, 3:10 PM IST

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రాథమిక సభ్యత్వంతో పాటు.. అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఐహెచ్​ఎఫ్​) చీఫ్​ హోదాకు నరేందర్ బత్రా రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల రెండు సమాఖ్యలకు రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. 2017లో ఐఓఏ అధ్యక్షుడిగా ఎంపికైన బత్రా.. కోర్డు ఆదేశాలతో ఇటీవల ఈ పదవి నుంచి తప్పుకున్నారు.

హాకీ ఇండియా నిధులు రూ.35 లక్షల దుర్వినియోగం చేసినట్టు బాత్రాపై అభియోగాలున్నాయి. దీనిపై సీబీఐ ప్రాథమిక విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో విచారణ పూర్తయ్యే వరకు బాత్రా.. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా కొనసాగవద్దని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అనిల్ ఖన్నా ఐఓఏ తాత్కాలిక అధ్యక్షుడిగా ఉంటారని కూడా కోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో మరుసటి రోజు.. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు బత్రా ప్రకటించారు.

ఐహెచ్​ఎఫ్ చీఫ్​ పదవికి రాజీనామా నేపథ్యంలో మొత్త మూడు లేఖలు రాశారు నరిందర్ బత్రా. భారత ఒలింపిక్ సంఘం, ఐహెచ్​ఎఫ్​కు రాజీనామా లేఖలను వేర్వేరుగా పంపారు. మూడో లేఖను అంతర్జాతీయ ఒలింపిక్​ సమాఖ్యకు పంపారు. సమాఖ్యల సభ్యులను ఉద్దేశించి అందులో రాశారు. తనకు ఇన్ని రోజులు సహకరించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి: అదరగొట్టే ఆట.. చూపుతిప్పుకోనివ్వని అందం.. ఈ అమ్మడి సొంతం

Last Updated : Jul 18, 2022, 3:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.