ETV Bharat / sports

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో నాదల్.. మెద్వెదెవ్​తో తుదిపోరు

Nadal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్​లో.. రఫెల్ నాదల్ ఆరోసారి ఫైనల్​కు దూసుకెళ్లాడు. ఫైనల్లో గెలిస్తే రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్​స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్​గా చరిత్ర సృష్టిస్తాడు. మరోవైపు డేనియల్​ మెద్వెదెవ్​ కూడా ఫైనల్స్​లో అడుగుపెట్టాడు.

Australian Open 2022
రఫెల్ నాదల్​, మెద్వెదెవ్
author img

By

Published : Jan 28, 2022, 12:30 PM IST

Updated : Jan 28, 2022, 5:14 PM IST

Nadal Australian Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్​లో రఫెల్ నాదల్ ఫైనల్​కు చేరాడు. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో మాటియో బెరెటినితో (ఇటలీ) హోరాహోరీగా సాగిన పోరులో 6-3,6-2,3-6,6-3 తేడాతో నాదల్ విజయం సాధించాడు. ఫైనల్​లోనూ గెలిస్తే రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్​స్లామ్ సింగిల్స్ టైటిల్ సొంతం చేసుకున్న ప్లేయర్​గా చరిత్ర సృష్టిస్తాడు.

మరోవైపు రెండో సెమీస్​లో టాప్​ సీడ్ డేనియల్ మెద్వెదెవ్ విజయం సాధించాడు. స్టెఫనోస్​ సిట్సిపాస్​ను 7-6, 4-6, 6-4, 6-1 తేడాతో ఓడించి ఫైనల్స్​లో అడుగుపెట్టాడు. ఆదివారం మెద్వెదెవ్, నాదల్ మధ్య ఆస్ట్రేలియన్ ఓపెన్​ ఫైనల్​ మ్యాచ్​ జరగనుంది.

ఫెదరర్​(స్విట్జర్లాండ్​), జకోవిచ్​(సెర్బియా) కూడా ప్రస్తుతం 20 గ్రాండ్​స్లామ్ సింగిల్స్​​ టైటిల్స్​తో ఉన్నారు. కరోనా వ్యాక్సినేషన్ తీసుకోని కారణంగా ఆస్ట్రేలియన్ ఓపెన్​లో ఆడేందుకు జకోవిచ్​కు అనుమతించలేదు ఆస్ట్రేలియా ప్రభుత్వం. దీంతో రఫెల్ నాదల్​కు చరిత్ర సృష్టించేందుకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ మిక్స్​డ్ డబుల్స్ విజేతగా క్రిస్టినా-ఇవాన్

Last Updated : Jan 28, 2022, 5:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.