ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో భారత బాక్సర్ మేరీకోమ్(51 కిలోలు)కు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన తుదిపోరులో ఓడి రజత పతకాన్ని గెలుచుకుంది. ఆమె కంటే 11 ఏళ్ల వయసు చిన్నదైన నాజీమ్ కైజాయ్(కజకిస్థాన్)పై 2-3 తేడాతో ఓటమిపాలైంది.
బాక్సింగ్ 51 కిలోల విభాగంలో విజేతగా నిలిచిన కైజాయ్కు 10 వేల డాలర్ల(రూ.7.23 లక్షలు) బహుమానం లభించగా.. రజత పతకం సాధించిన మేరీకోమ్కు 5వేల డాలర్లు(రూ.3.61 లక్షలు) వచ్చాయి. నాజీమ్ కైజాయ్ ఇప్పటికే రెండు సార్లు ప్రపంచ ఛాంపియన్గా.. ఆరుసార్లు జాతీయ ఛాంపియన్గా నిలిచింది.
ఈ టోర్నీలో సోమవారం పురుషుల విభాగంలో ఫైనల్స్ జరగనున్నాయి. ఇందులో భారత బాక్సర్లు అమిత్ పంగాల్(52 కిలోలు), శివ థాపా(64 కిలోలు), సంజీత్(91 కిలోలు) పోటీపడనున్నారు.
ఇదీ చూడండి: ఆసియా ఛాంపియన్షిప్ ఫైనల్లో మేరీకోమ్, సాక్షి