టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధమవుతున్న భారత మహిళా బాక్సర్ల శిక్షణ తిరిగి ప్రారంభమైంది. జాతీయ మహిళా బాక్సింగ్ శిక్షణ శిబిరంలో ఇటీవల కరోనా కేసులు నమోదవ్వడం వల్ల ఈ క్యాంప్‌ను తాత్కాలికంగా పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్కు తరలించారు. జులై 31 వరకు ఇక్కడే ఈ శిబిరాన్ని కొనసాగించనున్నారు.
మేరీ కోమ్‌తో(51 కిలోలు)పాటు సిమ్రంజిత్ కౌర్(60), లవ్లీనా బోర్గోహైన్(69), జమున బోరో(54), పూజారాణి(75), అరుంధతి చౌదరీ(69), మంజు రాణి(48), సోనియా లాథర్(57), లాల్బువాసైహి(64), షాషి చోప్రా(57) ఇక్కడ శిక్షణ తీసుకోనున్నారు. ఈ బాక్సర్లను రెండు స్పారింగ్ భాగస్వాములతో మూడు గ్రూపులుగా విభజించి అత్యంత భద్రత చర్యల మధ్య ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఇదీ చూడండి: బాక్సింగ్ శిబిరంలో 21 మందికి పాజిటివ్