ETV Bharat / sports

Presidents Cup Shooting: మనుకు స్వర్ణం.. రాహీకి రజతం - రాహి సర్నోబత్ రజతం

ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో(Presidents Cup Shooting 2021) భారత స్టార్‌ షూటర్లు మను బాకర్‌(manu bhaker news), రాహీ సర్నోబత్‌ సత్తా చాటారు. మను స్వర్ణంతో మెరవగా.. రాహీకి రజతం దక్కింది.

Manu Bhaker
మను
author img

By

Published : Nov 10, 2021, 8:49 AM IST

ప్రెసిడెంట్స్‌ కప్‌ షూటింగ్‌ టోర్నమెంట్లో(Presidents Cup Shooting 2021) భారత స్టార్‌ షూటర్లు మను బాకర్‌(manu bhaker news), రాహీ సర్నోబత్‌ సత్తా చాటారు. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్లో మను పసిడి గెలవగా.. 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో రాహీ(rahi sarnobat news) రజతం సొంతం చేసుకుంది.

మంగళవారం జరిగిన మిక్స్‌డ్‌ ఫైనల్లో మను-వార్‌లిక్‌ (టర్కీ) జోడీ 9-7తో గ్జియా (చైనా)-పీటర్‌ ఒలెక్‌ (ఇస్తోనియా) జంటను ఓడించింది. ఆరంభంలోనే 6-2తో ఆధిక్యంలో నిలిచిన మను జంట.. ఆ తర్వాత ప్రత్యర్థి నుంచి 6-6తో పోటీ ఎదుర్కొంది. కానీ ఒత్తిడిని అధిగమిస్తూ మను జోడీ విజేతగా నిలిచింది.

అంతకుముందు 25 మీటర్ల పిస్టల్‌ వ్యక్తిగత విభాగంలో రాహీ(rahi sarnobat news) సత్తా చాటింది. ఫైనల్లో చాలా వరకు రాహీదే అగ్రస్థానం. వరుసగా ఆమె మూడు సిరీస్‌లలో ముందంజలో నిలిచింది. కానీ చివరి రెండు సిరీస్‌లలో పిస్టల్‌ మొరాయించడం వల్ల రాహీ (31 పాయింట్లు) రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. వెన్‌కాంప్‌ (జర్మనీ, 33 పాయింట్లు) స్వర్ణం గెలుచుకుంది. ఇదే ఈవెంట్లో మను బాకర్‌(manu bhaker news) ఆరో స్థానంలో నిలిచింది. ఇదే టోర్నమెంట్లో(Presidents Cup Shooting 2021) సౌరభ్‌ చౌదరి (10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌) రజతం, అభిషేక్‌ వర్మ కాంస్యం గెలిచారు.

మిలింద్ విజృంభణ.. అగ్రస్థానంతో నాకౌట్​కు హైదరాబాద్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.