వచ్చే ఏడాది ఒలింపిక్స్ జరుగుతాయనే గట్టి నమ్మకంతో ఉన్నానని, అప్పటివరకూ తన ఫామ్‌ను కాపాడుకొని, ఆ మెగా క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన చేస్తానని యువ షూటర్ మను బాకర్ ఆశాభావం వ్యక్తం చేసింది.
"మంచి ఫామ్ అందుకున్న భారత షూటర్లు టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధమయ్యారు. కానీ ప్రజల ఆరోగ్యాలకు ప్రాధాన్యతనిచ్చి ఆ క్రీడలను ఏడాది పాటు వాయిదా వేశారు. 2021లో ఒలింపిక్స్ కచ్చితంగా జరుగుతాయనే నమ్మకంతో ఉన్నా. అప్పటివరకూ నా ఆటతీరు స్థిరంగా ఉండేలా చూసుకొని, ఆ క్రీడల్లో మెరుగైన ప్రదర్శన చేస్తాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నా. ప్రతికూల ఆలోచనలు పెట్టుకోకుండా ఒలింపిక్స్ కోసం మానసికంగా సిద్ధమయ్యా"
-మను, యువ షూటర్.
లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోని షూటింగ్ రేంజ్‌లో ఎలక్ట్రానిక్ లక్ష్యాన్ని అమర్చుకుని సాధన చేస్తున్నట్లు మను తెలిపింది.