32వ ఒలింపిక్ గేమ్స్ శుక్రవారం సాయంత్రం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జపాన్ చక్రవర్తి నరుహిటోతో పాటు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు థామస్ బాచ్ విశ్వక్రీడలను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన వేడుకల్లో భాగంగా.. టోక్యో గడ్డ మీద మువ్వన్నెల జెండా రెపరెపలాడింది.
ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనే దేశాల క్రీడాకారులు పరేడ్ నిర్వహించడం అనవాయితీ. అయితే ఈ పరేడ్‌లో ఆధునిక ఒలింపిక్స్ పుట్టిన దేశమైన గ్రీస్ బృందం వరుసలో ముందు ఉంది. ఆ తర్వాత జపాన్ భాషలో అల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం టీమ్స్ పరేడ్‌లో పాల్గొన్నాయి. ఈ పరేడ్‌లో భారత్ తరఫున 19 మంది అథ్లెట్లు, ఆరుగురు అధికారులు పాల్గొన్నారు. ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్, హాకీ టీమ్ కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ మన జాతీయ జెండాతో బృందాన్ని ముందుండి నడిపించారు.
-
#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021#WATCH | Prime Minister Narendra Modi stands up to cheer athletes as the Indian contingent enters Olympic Stadium in Tokyo during the opening ceremony.#TokyoOlympics pic.twitter.com/SUheVMAqIK
— ANI (@ANI) July 23, 2021
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభం నేపథ్యంలో జపాన్ ప్రధానమంత్రి యోషిహిదే సుగాకు మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వక్రీడల ద్వారా ప్రపంచపు ఉత్తమ క్రీడాకారుల ప్రదర్శన చూసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఒలింపిక్స్ పరేడ్‌లో భారత బృందాన్ని వర్చువల్‌గా వీక్షించిన ఆయన.. ఈ సందర్భంగా క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో పాటు పలువురు ఒలింపిక్ మాజీ క్రీడాకారులు వర్చువల్‌గా వీక్షించారు.
-
Union Youth Affairs & Sports Minister Anurag Thakur cheers for the Indian contingent from Delhi.
— ANI (@ANI) July 23, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
MoS Sports Nisith Pramanik & Olympic medallist Karnam Malleswari are also present on the occasion.#TokyoOlympics pic.twitter.com/8irt79lA1G
">Union Youth Affairs & Sports Minister Anurag Thakur cheers for the Indian contingent from Delhi.
— ANI (@ANI) July 23, 2021
MoS Sports Nisith Pramanik & Olympic medallist Karnam Malleswari are also present on the occasion.#TokyoOlympics pic.twitter.com/8irt79lA1GUnion Youth Affairs & Sports Minister Anurag Thakur cheers for the Indian contingent from Delhi.
— ANI (@ANI) July 23, 2021
MoS Sports Nisith Pramanik & Olympic medallist Karnam Malleswari are also present on the occasion.#TokyoOlympics pic.twitter.com/8irt79lA1G
ఇదీ చూడండి.. Tokyo Olympics: అట్టహాసంగా ఆరంభోత్సవం