ETV Bharat / sports

పీవీ సింధు, సాయి ప్రణీత్​ శుభారంభం.. రెండో రౌండ్​కు అర్హత - pv sindhu

Malaysia masters PV Sindhu: మాలేషియా మాస్టర్స్​లో భారత బ్యాడ్మింటన్ స్టార్స్​ పీవీ సింధు, సాయి ప్రణీత్ జోరు ప్రదర్శించారు. రెండు రౌండ్​కు అర్హత సాధించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్​లో హి బింగ్‌ జియావొపై సింధు, కెవిన్​ కార్డెన్​పై ప్రణీత్​ గెలిచారు.

PV Sindhu B Sai praneet
పీవీ సింధు, సాయి ప్రణీత్​
author img

By

Published : Jul 6, 2022, 2:07 PM IST

Malaysia masters PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్ ప్లేయర్​ పీవీ సింధు శుభారంభం చేసింది. బుధవారం జరిగిన తొలి రౌండ్​లో చైనాకు చెందిన హి బింగ్‌ జియావొ​పై(He Bing Jiao) గెలిచింది. 21-13,17-21,21-15 తేడాతో విజయం సాధించింది. ఈ పోరు 57నిమిషాల పాటు సాగింది.

మరోవైపు స్టార్​ షట్లర్​ బీ సాయి ప్రణీత్​ కూడా తొలి రౌండ్​ను విజయంతో ముగించాడు. కెవిన్​ కార్డెన్​పై 21-8, 21-9 తేడాతో గెలిచాడు. ఈ పోరు 26నిమిషాల పాటు సాగింది. అయితే సమీర్​ వర్మకు మాత్రం ఓటమి ఎదురైంది. తైవాన్​కు చెందిన చో టైన్​ చెన్​పై(chou tien chen) 10-21,21-12,21-14 తేడాతో ఓడిపోయాడు.

అంతకుముందు మంగళవారం జరిగిన పోటీల్లో మహిళల డబుల్స్‌ తొలి రౌండ్లో గాయత్రి-ట్రెసా 14-21, 14-21తో పియర్లె టాన్‌-టిన్యా (మలేసియా) చేతిలో ఓటమి చవిచూశారు. మహిళల డబుల్స్‌లో భారత్‌కు చెందిన మరో రెండు జోడీలు ఇంటిముఖం పట్టాయి. అశ్విని భట్‌-శిఖా గౌతమ్‌ 7-21, 10-21తో యుకి-సయాక (జపాన్‌) చేతిలో ఓడగా.. పూజ దండు-ఆర్తి సారా 17-21, 17-21తో గాబ్రియెలా స్టొయివా-స్టెఫానీ స్టొయివా (బల్గేరియా) చేతిలో ఓటమి పాలయ్యారు. మహిళల సింగిల్స్‌లో మాల్విక బన్సోద్‌ 10-21, 17-21తో గో జిన్‌ వీయ్‌ (మలేసియా) చేతిలో ఓడింది.

ఇదీ చూడండి: టీమ్ఇండియాకు షాక్.. డబ్ల్యూటీసీ పాయింట్లలో కోత.. పాక్ కంటే దిగువకు..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.