ETV Bharat / sports

మలేసియా మాస్టర్స్​ సెమీస్​లోకి ప్రణయ్.. నిరాశపరిచిన సింధు​ - pv sindhu today match

Malaysia masters super 500: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ జపాన్ స్టార్ కంటా త్సునెయమాపై గెలిచి సెమీఫైనల్ చేరగా..డబుల్​ ఒలింపిక్ విజేత పీవీ సింధు ఓటమి పాలైంది.

malaysia masters super 500
malaysia masters super 500
author img

By

Published : Jul 8, 2022, 11:23 PM IST

Malaysia masters super 500: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 టోర్నీలో భారత్‌కు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. భారత స్టార్ షట్లర్ హెచ్ ఎస్ ప్రణయ్ సెమీఫైనల్ చేరగా..డబుల్​ ఒలింపిక్ విజేత పీవీ సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్‌ ఫైనల్లో రెండో సీడ్‌ తై జూయింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో సింధూ ఓటమి పాలైంది.

టాప్ 10 ప్లేయర్​ ప్రణయ్​ మరోసారి తన సత్తా చాటాడు. పురుషుల క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 14వ ర్యాంకర్, జపాన్ స్టార్ కంటా త్సునెయమాను 25-23, 22-20 తేడాతో ఓడించాడు. 60 నిమిషాల పాటు జరిగిన పోరులో ప్రణయ్ పూర్తి ఆధిపత్యం చెలాయించాడు. జపాన్ షట్లర్ నుంచి కొంత ప్రతి ఘటన ఎదురైనా ప్రణయ్ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు.

Malaysia Masters quarter final PV Sindhu loss: మలేసియా మాస్టర్స్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్​ టోర్నీ భారత స్టార్​ షట్లర్ పీవీ సింధుకు చుక్కెదురైంది. శుక్రవారం జరిగిన క్వార్టర్స్​ పోటీల్లో ఆమె ఓడిపోయి ఇంటిముఖం పట్టింది. రెండో సీడ్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ)పై 13-21 21-12 12-21 తేడాతో చతికిలపడింది. 55నిమిషాల పాటు సాగిందీ పోరు. కెరీర్​లో ఇది ఆమెకు 17వ ఓటమి.

ఇటీవల మలేసియా ఓపెన్‌ క్వార్టర్స్‌లోనూ తై జు చేతిలో ఓడిన సింధు ఓడిపోయింది. ఆమెపై మెరుగైన రికార్డు లేకపోవడం సింధుకు ప్రతికూలాంశం. ఇప్పటి వరకు ఈ మ్యాచ్​తో కలిపి వీరిద్దరు 22 సార్లు తలపడగా.. సింధు అయిదింట్లో గెలవగా, 17 మ్యాచ్‌ల్లో తై జు పైచేయి సాధించింది.

ఇదీ చదవండి: Malaysia Masters: క్వార్టర్​ ఫైనల్స్​లో సింధుకు షాక్​.. మళ్లీ ఆమె పైనే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.