ETV Bharat / sports

Malaysia Masters 2023 : పీవీ సింధుకు నిరాశ.. ఫైనల్స్​కు చేరిన ప్రణయ్​ - మలేసియా మాస్టర్స్‌ 2023 కిదాంబి శ్రీకాంత్​

Malaysia Masters 2023 PV Sindhu : మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్​ టోర్నీ సెమీఫైన్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధుకు నిరాశ ఎదురైంది. హెచ్​ఎస్​ ప్రణయ్​.. తన ప్రత్యర్థిని ఓడించి ఫైనల్​కు దూసుకెళ్లాడు.

pv sindhu Malaysia Masters 2023
pv sindhu Malaysia Masters 2023
author img

By

Published : May 27, 2023, 4:34 PM IST

Updated : May 27, 2023, 5:33 PM IST

Malaysia Masters 2023 Final HS Prannoy : మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అదరగొట్టాడు. సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఇండోనేసియా ప్లేయర్​ క్రిస్టియన్ అడినటాను వెనక్కు నెట్టి ఫైనల్​లో అడుపెట్టాడు. మొదటి గేమ్​లో 19-17తో ప్రణయ్​ లీడ్​లో ఉండగా.. అడినటా గాయంతో వెనుదిరిగాడు. ఓ షాట్​కు ప్రయత్నించే సమయంలో ఎగిరి.. ల్యాండ్​ అవుతుండగా అడినటా ఎడమ మోకాలుకు గాయం అయింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడిన అడినటాను వీల్​ ఛైర్​లో కోర్టు బయటకు తీసుకెళ్లారు. ఇక ఫైనల్​లో చైనీస్​ తైపీ లేదా చైనాకు చెందిన షట్లర్ లిన్​ చుయ్​ను ప్రణయ్​ ఎదుర్కొనున్నాడు. అయితే, పారిస్​ ఒలంపిక్స్​కు చేరుకునేందుకు ఈ మలేసియా మాస్టర్స్ టోర్నీయే​ మొదటి ఈవెంట్​.

Malaysia Masters 2023 PV Sindhu : ​ఇకపోతే ఈ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్​కు దూసుకెళ్లింది ఒలింపిక్​ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. అయితే మహిళల సింగిల్స్​లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైన్​లో సింధు 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్​ కేవలం 44 నిమిషాల్లోనే ముగిసింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్​ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. అయితే, ఈ మలేసియా మాస్టర్స్​ ట్రోఫీ దాదాపు ఖాయం అనుకున్న దశలో సింధుకు నిరాశే మిగిలింది.

PV Sindhu Injury : గతేడాది ఆగస్టులో జరిగిన కామన్​వెల్త్​ గేమ్స్​లో పీవీ సింధుకు గాయం అయింది. దాదాపు ఐదు నెలల పాటు ఇంట్లోనే ఉన్న సింధు.. ఈ ఏడాది జనవరిలో జరిగిన మలేసియా ఓపెన్​లో తిరిగి షటిల్​ పట్టుకుంది. అయితే, ఈ టోర్నీతో పాటు ఇదే నెలలో జరిగిన ఇండియన్ ఓపెన్​లో కూడా ఓటమిపాలైంది. 2023 మార్చి ఆరంభంలో జరిగిన ఆల్​ ఇంగ్లాండ్​ ఛాంపియన్​షిప్​ నుంచి మొదటి రౌండ్​లోనే బయటకు వచ్చేసింది పీవీ సింధు. ఆ తర్వాత జరిగిన స్విస్​ ఓపెన్ సూపర్​ 300​లో టైటిల్​ చేజార్చుకుంది.

క్వార్టర్స్​లో వెనుదిరిగిన కిదాంబి శ్రీకాంత్..
Malaysia Masters 2023 Kidambi Srikanth : వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత స్టార్‌ షట్లర్ కిదాంబి శ్రీకాంత్​కు కూడా బ్రేక్​ పడింది. శుక్రవారం జరిగిన పురుషుల​ క్వార్టర్స్ పోరులో ఆదినాత్ చేతిలో 16-21, 21-16 21-11 ఓటమిపాలయ్యాడు. ప్రిక్వార్టర్స్ థాయ్​లాండ్​కు చెందిన​ వరల్డ్​ నంబర్​ 5 ర్యాంకర్‌ కున్లావుత్‌ వితిద్‌సర్న్‌పై సంచలన విజయాన్ని సాధించిన కిదాంబి.. అదే ఆటతీరును క్వార్టర్ ఫైనల్​లో ప్రదర్శించలేకపోయాడు.

Last Updated : May 27, 2023, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.